గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం నందిగాం: నవంబర్ 14 శనివారం: మేజర్ న్యూస్ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా గ్రంథాలయాధికారి ఎస్.ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO నరసింహం విచ్చేశారు. ముందుగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బా
గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
నందిగాం: నవంబర్ 14 శనివారం: మేజర్ న్యూస్
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా గ్రంథాలయాధికారి ఎస్.ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO నరసింహం విచ్చేశారు. ముందుగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటారు కావున MEO నరసింహం చేతులు మీదగా జవహర్ లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. తదుపరి వారు మాట్లాడుతూ గ్రంధాలయాలు విజ్ఞానబండగరాలు కావున ప్రతిఒక్కరి తమ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా గ్రంథాలయానికి విచ్చేసి కథలు పుస్తకాలు, న్యూస్ పేపర్ రీడింగ్ అలవర్చుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రోహిణి , జగన్మోహన్ , తనూజ , బల్లు మోహన్ రావు గారు మరియు గ్రంథాలయ సహాయకురాలు కె.రాములమ్మ,విద్యార్థిని విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.
రిపోర్టర్: శ్రీనివాస్ లబ్బ