రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు
గుంటూరు రూరల్, మేజర్ న్యూస్:
గుంటూరు నగర శివారు జాతీయ రహదారి పై లాలుపురం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు గాయపడ్డారు. గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్తున్న లారీని వెనకగా వస్తున్న కారు ఢీకొంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇరువురు కి గాయాలయ్యాయి. 108 సిబ్బంది వాహనంలో క్షతగాత్రును గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నల్లపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆళ్ల వీరభద్రరావు, జిల్లా నేర విభాగం ప్రతినిధి