BREAKING
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి - ఎమ్మెల్యేలను కోరిన టీయూడబ్ల్యూజే – ఐజేయూ నాయకులు చిన్నారుల ఆనందమే నిజమైన అభివృద్ధి మంత్రి సీతక్క ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మధుమేహ నియంత్రణకు ముందస్తు పరీక్షలే కీలకం: నారాయణ వైద్యులు గుడుంబా రహిత గ్రామాలే లక్ష్యం... అక్రమార్కులపై పోలీసుల ఉక్కు పాదం...! బొక్కలగుట్టలో బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గ్రామసభ గిగ్ వ‌ర్క‌ర్లు దేశానికి పునాదులుః విప‌క్ష నేత‌ రాహుల్ గాంధీ ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు ఫోటోలకు ఫోజులేనా... విగ్రహాల మరమ్మతులకు సహకారం ఏది కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి వాకిటి ఖానాపురంలో బాల గ్రామసభ యూటీఎఫ్ మండల నూతన కమిటీ ఎన్నిక శ్రమదానంతో పురాతన బావి శుభ్రం పేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ భరోసా

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి వాకిటి

Select Suryaa Now
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి వాకిటి

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించిన స్వామి వారి అలంకరణ మహోత్సవ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు . అమరచింత మండల కేంద్రం నుంచి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను, ఆత్మకూరు పట్టణం ఎస్‌బిఐ బ్యాంకు నుంచి తీసుకువచ్చిన ఆభరణాలను ప్రత్యేక పూజ నిర్వహించి ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారికి సమర్పిస్తారు. దక్షిణ తెలంగాణలోనే విశేష ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా భక్తుల తాకిడితో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉద్దాల మహోత్సవంతో పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తాయని ఈ సందర్భంగా  మంత్రి పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. 
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.