BREAKING
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి - ఎమ్మెల్యేలను కోరిన టీయూడబ్ల్యూజే – ఐజేయూ నాయకులు చిన్నారుల ఆనందమే నిజమైన అభివృద్ధి మంత్రి సీతక్క ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మధుమేహ నియంత్రణకు ముందస్తు పరీక్షలే కీలకం: నారాయణ వైద్యులు గుడుంబా రహిత గ్రామాలే లక్ష్యం... అక్రమార్కులపై పోలీసుల ఉక్కు పాదం...! బొక్కలగుట్టలో బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గ్రామసభ గిగ్ వ‌ర్క‌ర్లు దేశానికి పునాదులుః విప‌క్ష నేత‌ రాహుల్ గాంధీ ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు ఫోటోలకు ఫోజులేనా... విగ్రహాల మరమ్మతులకు సహకారం ఏది కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి వాకిటి ఖానాపురంలో బాల గ్రామసభ యూటీఎఫ్ మండల నూతన కమిటీ ఎన్నిక శ్రమదానంతో పురాతన బావి శుభ్రం పేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ భరోసా

ఫోటోలకు ఫోజులేనా... విగ్రహాల మరమ్మతులకు సహకారం ఏది

Select Suryaa Now
ఫోటోలకు ఫోజులేనా... విగ్రహాల మరమ్మతులకు సహకారం ఏది

కాజీపేట, మేజర్ న్యూస్, హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణంలోని ఎలక్ట్రిక్ లోకో షెడ్ కాలనీ, శాంతి కళా సంఘం ఆధ్వర్యంలో జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహాలు పూర్తిగా చెడిపోవడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే జాతీయ నాయకుల విగ్రహాల ఏర్పాటు, నిర్వహణ, మరమ్మతుల విషయంలో రాజకీయ నాయకులు చూపిస్తున్న నిర్లక్ష్యంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జాతీయ నాయకుల విగ్రహాల వద్దకు వచ్చినప్పుడు ఫోటోలకు ఫోజులిస్తూ ప్రచారం పొందేందుకు నాయకులు ఆసక్తి చూపుతున్నారని, కానీ విగ్రహాల మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన సమయంలో మాత్రం ముందుకు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జాతీయ నాయకుల విగ్రహాలు కేవలం ఆవిష్కరణలు, పూలమాలలు, ఫోటోలకు మాత్రమే పరిమితం కాకుండా వాటి గౌరవాన్ని కాపాడేలా నిరంతర నిర్వహణ చేపట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత నాయకులు, ప్రజాప్రతినిధులు స్పందించి విగ్రహాల మరమ్మతులు, నిర్వహణకు సహకరించాలని, జాతీయ నాయకుల పట్ల గౌరవాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని ప్రజలు కోరుతున్నారు.

రిపోర్టర్; గిరి ప్రసాద్, కాజీపేట, హనుమకొండ జిల్లా