BREAKING
బాలికల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత నాయకపుగూడ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఇంకా వైసీపీపై విమర్శలా చిన్నారుల చిరునవ్వులే దేశానికి వెలుగులు!!! శిరిడి సాయి స్కూల్ అధినేత ముత్యాలప్ప విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనమే పునాది రాజన్న ఆలయ విస్తరణ పనులు శరవేగంగా పూర్తి చేయాలి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరదాల చాటున గిరిజన విద్యార్థుల చదువు కష్టాలు అమరనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారవేత్త ఈశ్వర్ నాయుడు పంట నష్టాన్ని అంచనా వేసి గుండాల రైతులకు న్యాయం చేయాలి 8వ పీడియాట్రిక్ డయాలసిస్ అండ్ థెరప్యూటిక్ అఫెరిసిస్ మాడ్యూల్ ఫర్ ఎమర్జెన్సీ శిక్షణ కార్యక్రమం కన్నెపల్లిలో ఘనంగా బాల గ్రామ సభ - నెహ్రూ జయంతి వేడుకలు మెడికవర్ ఆసుపత్రిలో ప్రపంచ మధుమేహ దినోత్సవ అవగాహన కార్యక్రమం కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భీరం శ్రీధర్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సింగరేణి గనులను ప్రైవేటుకు అప్పగిస్తే సహించేది లేదు - ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య

చిన్నారుల ఆనందమే నిజమైన అభివృద్ధి మంత్రి సీతక్క

Select Suryaa Now
చిన్నారుల ఆనందమే నిజమైన అభివృద్ధి మంత్రి సీతక్క

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు, వారి ఆనందమే నిజమైన అభివృద్ధికి కొలమానం.. ప్రతి చిన్నారికి సురక్షితమైన బాల్యం, మంచి ఆరోగ్యం, నాణ్యమైన విద్య, ఉన్నతమైన భవిష్యత్తు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అన్నారు. బంజారాహిల్స్‌లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల సంక్షేమం, రక్షణకు సంబంధించి పలు నూతన కార్యక్రమాలను ప్రారంభించారు.
దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని బాలల దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి సీతక్క అన్నారు. “బాలబాలికలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే” అంటూ చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. నెహ్రూ, అంబేద్కర్ వంటి మహనీయుల కృషి వల్లే దేశం ప్రజాస్వామ్య వ్యవస్థగా రూపుదిద్దుకుందని, అణగారిన వర్గాలకు అనేక హక్కులు లభించాయని మంత్రి గుర్తుచేశారు. దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు వారు చేసిన త్యాగాలు, సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. “ఎంతోమంది పుడతారు.. చనిపోతారు.. ఆ రెండింటి మధ్యలో మనం చేసే సేవే మనల్ని ప్రజల్లో నిలుపుతుంది” అని మంత్రి సీతక్క అన్నారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని నెహ్రూ చెప్పిన ఆశయాలకు అనుగుణంగా బాలల రక్షణ, సంరక్షణ, పోషకాహారం, విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బాలలపై వేధింపులు, బాల్యవివాహాలను అరికట్టడంతో పాటు ఆపదలో ఉన్న ప్రతి చిన్నారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిన్నారుల భద్రతతో పాటు మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
బాలల దినోత్సవం సందర్భంగా నాలుగు కొత్త కార్యక్రమాలను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న సామ్‌, మామ్‌ చిన్నారుల పర్యవేక్షణకు కృత్రిమ మేధ (ఎI) ఆధారిత వ్యవస్థను ప్రారంభించామన్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. బాలల సంరక్షణ, దత్తత వ్యవస్థను విస్తరించేందుకు ఆరు నూతన ప్రత్యేక దత్తత సంస్థలు, హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో నాలుగు కొత్త చైల్డ్‌లైన్ సహాయ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దత్తత ప్రక్రియను మరింత వేగవంతం, సులభతరం చేయాల్సిన అవసరం ఉందని సీతక్క అన్నారు. దత్తతలో జాప్యం జరిగితే అక్రమ దత్తతకు అవకాశాలు పెరిగే ప్రమాదం ఉందని, చట్టబద్ధమైన దత్తత ప్రక్రియను బలోపేతం చేయడం ద్వారా దీనిని అరికట్టవచ్చని తెలిపారు. “పిల్లలను పసి మొగ్గల్లా కాపాడుకోవాలి. కానీ ఆ పసి మొగ్గలపై కలుషిత ఆహారం, రసాయనాల ప్రభావం పడుతోంది. పిల్లలు తినే ఆహారం, పాలు కూడా సురక్షితంగా ఉండాలి” అని మంత్రి అన్నారు. చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన టీ-సేఫ్ వంటి చర్యలను ప్రస్తావించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల బాగోగులను కంటికి రెప్పలా కాపాడాలని సిబ్బందికి మంత్రి సూచించారు. “అంగన్వాడీ సిబ్బంది చిన్నారులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకోవాలి.. అమ్మ ఒడి స్థాయిలో ఆప్యాయత, అంగన్వాడీ స్థాయిలో బాధ్యతతో పనిచేయాలి” అని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నామని, చిన్నారులు, సిబ్బందికి యూనిఫాంలు అందిస్తున్నామని, ప్రీస్కూల్ కిట్లను కూడా అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ప్రారంభించిన అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
బాల సదన్‌లలోని అనాథ పిల్లలకు ప్రభుత్వ గుర్తింపు పత్రాలను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బాల సదన్‌లలోని చిన్నారులకు ఆధార్, ఆరోగ్య, కుల, జనన, యుడిఐడి, అనాథ ధృవీకరణ వంటి పత్రాలను అందించే చర్యలు చేపట్టామని చెప్పారు.
పిల్లలు లేనిది భవిష్యత్తు లేదు. ప్రతి చిన్నారి ఆరోగ్యంగా, ఆనందంగా, ఆప్యాయంగా ఎదగాలి. వారి చిరునవ్వే మన అభివృద్ధికి అసలైన కొలమానం” అని మంత్రి సీతక్క అన్నారు. బాలల రక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, సమాజం సమిష్టిగా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాల్యవివాహాలు, బాలలపై వేధింపులు, దుర్వినియోగాన్ని గుర్తించి అడ్డుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
బాలల దినోత్సవ వేడుకల్లో బాలల హక్కుల కమిషన్ సభ్యులు చందన, గూగులో సరిత, వచన్, ప్రేమలత అగర్వాల్, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శృతి ఓజా, కమిషనర్ సంగీత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపాలు, మొబైల్ దుర్వినియోగంపై చిల్డ్రన్ హోమ్ పిల్లలు ప్రదర్శించిన నాటకం ఆకట్టుకున్నాయి.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.