యూటీఎఫ్ మండల నూతన కమిటీ ఎన్నిక
ఇబ్రహీంపట్నం: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఇబ్రహీంపట్నం మండల నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కోశాధికారి జగన్నాథ్ శర్మ, జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ఎంపిక చేశారు. మండల అధ్యక్షుడిగా ఎస్. నరసింహ, ప్రధాన కార్యదర్శిగా ఎస్.కె. జహీర్ ఆజాద్, ఉపాధ్యక్షులుగా కొరివి రవి, బి. అరుణ, కోశాధికారిగా జె. శ్రీనివాస్ ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ సభ్యులుగా కిరణ్ కుమార్, విజయ్ కాంత్, కుమార్, సీహెచ్ కృష్ణకుమారి, రిహానా పర్వీన్, భాగ్యశ్రీలను ఎన్నుకున్నారు. ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా డి. నరసింహ, సోషల్ మీడియా కన్వీనర్‌గా కే. శ్రీనివాసులు, మండల కార్యవర్గ సభ్యులుగా సీహెచ్ బాలకృష్ణ, జైరాంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కోశాధికారి జగన్నాథ్ శర్మ, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ... ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగ అభివృద్ధి కోసం యూటీఎఫ్ నిరంతరం పోరాటాలు సాగిస్తోందన్నారు. సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలు, బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మంచాల మండల అధ్యక్షులు ఎండి అజ్మత్ ఖాన్ , ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా