ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
సూర్య, ఆదిలాబాద్ ప్రతినిధి : పుస్తక పఠనం మనిషి జీవితానికి విజ్ఞానాన్ని, వికాసాన్ని, వివేకాన్ని అందించే అమూల్యమైన సాధనం.గ్రంథాలయాలు సమాజా అభ్యున్నతికి,విద్యార్థుల భవిష్యత్తుకు,యువతలో సృజనాత్మక ఆలోచనలకు పునాదులుగా నిలుస్తున్నాయి. స్థానిక గిరిజన డిగ్రీ కళాశాలలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను 14 నవంబర్ 2026 నుండి 20 నవంబర్ 2026 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో పుస్తక పఠన సంస్కృతిని పెంపొందించడం, ప్రతి విద్యార్థి రోజు కొంత సమయాన్ని పుస్తక పాఠనానికి కేటాయించాలని, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ ముంతాజ్ బేగం మరియు అధ్యాపకులు తెలిపారు.సమాజానికి విజ్ఞానాన్ని పంచే ఙ్ఞాన దీపాలైన గ్రంథాలయాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పత్రికా రంగం పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు