BREAKING
రెండోవిడత పల్లెపోరుకు రెడీ విరుచుకుపడనున్న ‘అక్వాన్’ తుఫాన్.. 20న నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం! పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన--పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎంపీడీవో దీప్తి 28వ వార్డులో అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు : అపూర్వ స్వాగతం పలికిన పచ్చిపాల తులసి రామకృష్ణ దంపతులు గ్రంథాలయ ఉద్యమ నేతల సేవలు మరువలేనివి. నిరుపేదల ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నక్యాంటీన్‌ : పేదలతో కలిసి అల్పాహారం చేసిన చైర్మన్ శ్రీరామ్ చినబాబు వంకాయ పంటలో చీడపీడల నియంత్రణపై రైతులకు అవగాహన.. అమృత విద్యార్థుల ప్రదర్శన ప్రతి ప్రకృతి వ్యవసాయ రైతుకూ సర్టిఫికేషన్ తప్పనిసరి -- కె. అమల కుమారి ఏపీ వచ్చే పదేళ్లలో నంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తుంది బసవ సూర్యనారాయణకు రావాడ సీతారాం ఘన నివాళి హనీ ట్రాప్, సైబర్ గూఢచర్యంపై ఐఏఎఫ్ చీఫ్ అశుతోష్ దీక్షిత్ కీలక వ్యాఖ్యలు! క్రోసూరులో 59 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. ధాన్యం కొనుగోలుపై సిబ్బందికి శిక్షణ కోటప్పకొండకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుకు భక్తుల కృతజ్ఞతలు సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్’ పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖ నేతలు

కోటి సోమవారము కాకాని శివయ్య సన్నిధిలో పోటెత్తిన భక్తులు--- వివిధ సేవా రుసుములు ద్వారా రూ.9,25,000/- ఆదాయము.

Select Suryaa Now
కోటి సోమవారము కాకాని శివయ్య సన్నిధిలో పోటెత్తిన భక్తులు--- వివిధ సేవా రుసుములు ద్వారా రూ.9,25,000/- ఆదాయము.
పెదకాకాని  న్యూస్ :శ్రీ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానములో కార్తీకమాస శ్రవణా నక్షత్రంతో కూడిన కోటి సోమవారము వేకువజాము నుండే భక్తులు యజ్ఞాల బావి వద్ద కార్తీకమాస స్నానమాచరించి అత్యంత భక్తి శద్ధలతో మెక్కుబడులను తీర్చుకొని శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణములో భక్తులు కార్తీక దీపారాధనలు చేసినారు. దేవస్థానమునకు విచ్చేసిన భక్తులు ప్రత్యేకముగా ఏర్పాటు చేసిన క్యూ లైనులు ద్వారా తర్వితగతిన దర్శనము, శ్రీ స్వామి వారికి అభిషేకములు జరిపించుకున్నారు. క్యూలైనుల నందు భక్తుల సౌకర్యార్ధము ఉచితముగా పాలు, మంచినీళ్ళ బాటిల్స్న, శ్రీ స్వామి వారి ఉచిత అన్నప్రసాదమును ఏర్పాటు చేసినట్లు ఆలయ ఉపకమీషనరు పి. శ్రీనివాసులురెడ్డి, పాలకమండలి ఛైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. సోమవారము శ్రీ స్వామి వారి దర్శించుకున్న వారిలో దేవాదాయశాఖ కమీషనరు కె.రామచంద్రమోహన్ దంపతులు ఉన్నారు.ఆలయ ప్రాంగణములో ప్రభలతో శ్రీ స్వామి వారి మ్రొక్కులు తీర్చుకున్నారు. కళ్యాణ కట్ట నందు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీ స్వామి వారి పోంగళ్లు నివేదను సమర్పించుకున్నారు. దేవాలయ అన్ని విభాగములను ఆలయ ఉపకమీషనరు పి.శ్రీనివాసులురెడ్డి, పాలకమండలి ఛైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు ప్రత్యక్షముగా పరిశీలించి భక్తులకు ఏ విధమైన అసౌకర్యము కలుగకుండ సిబ్బందికి తగు సూచనలు చేసినారు. శానిటేషన్ పై ప్రత్యేక శద్ధ కనపరచి ఆలయ ప్రాంగణములు పరిశుభ్రముగా ఉంచారు. కార్తీకమాస మొదటి సోమవారము వివిధ సేవా రుసుములు, ప్రసాదము విక్రయము, అన్నప్రసాద విరాళములు ద్వారా రూ. 9,25,000/-లు ఆదాయం వచ్చినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి పి.శ్రీనివాసులురెడ్డి తెలిపారు. దేవస్థాన ప్రాంగణములు మరియు రహాదారులలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యము కలుగకుండ పెదకాకాని పోలీసు వారు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అగ్నిమాపకశాఖ, పంచాయితీశాఖ, వైద్యశాఖ తదితర శాఖల సహాకారము అందజేసినట్లు తెలిపారు.