BREAKING
జనగణనలో ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ ఇచ్చి శాస్త్రీయంగా లెక్కించాలి వచ్చే పార్లమెంట్ సమావేశంలోనే రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలి-- సంచారజాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసల రవి డిమాండ్ వలసదారులపై బో ఫ్రెంచ్ వివాదాస్పద పోస్ట్: 'గ్రామర్' తప్పుతో సోషల్ మీడియాలో ట్రోలింగ్! నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల సందడి--పాల్గొన్న ఎంపీ లావు, ఎమ్మెల్యే చదలవాడ ఈ-ఆటోల ద్వారా నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ జరగాలి --నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రధాన డ్రెయిన్లలో పూడికతీత పనులను తక్షణమే పూర్తి చేయాలి --నగర కమిషనర్ మయూర్ అశోక్ మార్కాపురం జిల్లాలో కరవు నివారణ మరియు సమగ్ర ఉపశమన చర్యలకు పెద్దపీట: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కు డ్రోన్ టెక్నాలజీతో నిఘా సెన్సెక్స్ టార్గెట్ 95,000: భారత మార్కెట్లపై మోర్గాన్ స్టాన్లీ బుల్లిష్ అంచనా! స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో గ్రంథాలయ ఉద్యమ నిర్మాణం - విశ్రాంత అధికారి పి.వి. మల్లేశ్వర్ అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన రామిరెడ్డి సురేష్ రెడ్డి గజపతినగరంలో భక్తులతో పోటెత్తిన ఉమా రామలింగేశ్వర ఆలయం టిటిడి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి సమాజంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివి .... సంచలనాలు కాదు మీడియాకు సమాజ సేవ ముఖ్యం

మా సగర (ఉప్పర) జాతి ది ఉనికి కోసం పోరాటం.* *నల్లగొండ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు.. నేర్లకంటి రవికుమార్ సగర

Select Suryaa Now
మా సగర (ఉప్పర) జాతి ది ఉనికి కోసం పోరాటం.* *నల్లగొండ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు.. నేర్లకంటి రవికుమార్ సగర

 

నల్లగొండ మేజర్ న్యూస్..

సగర ఉప్పర జాతి ఉనికి కోసం పోరాటమని సగరసంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు నేర్లకంటి రవికుమార్ అన్నారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టి అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రవికుమార్ సగర మాట్లాడుతూ బీసీ డీ నుండి బీసీ ఏలోకి మార్చి, 1986 లో ఉన్న బీసీ ఏ సిఫార్సు ను అమలు చేయాలని ఆయన ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.పవిత్ర గంగను భువికి రప్పించిన భగీరథ మహర్షి వంశీకులుగా చెప్పుకునే మా జాతి,శతాబ్దాలుగా ఈ నేలకు నీటిని పంచిందని,కానీ నేడు మా జాతి తన ఉనికి కోసం, తన గుర్తింపు కోసం,తమ బతుకు కోసం అలమటిస్తున్నామని పేర్కొన్నారు.ఆధునిక యంత్రాల దెబ్బకు తమ సాంప్రదాయ వృత్తిని కోల్పోయి,నగరాల్లో దినసరి కూలీలుగా మారిన 4 లక్షల మంది సగర బిడ్డలు నేడు ఒకే ఒక నినాదంతో రోడ్డెక్కారని, "మమ్మల్ని బి సి డి నుండి తొలగించి బీసీ ఏ లోకి చేర్చండి"అని కోరారు.
సగరులు 95 శాతం వృత్తి లేక, గ్రామాల్లో పని లేక లక్షలాది కుటుంబాలు హైదరాబాద్, వరంగల్,కరీంనగర్,ఖమ్మం లాంటి నగరాలకు వలసలు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అక్కడ భవన నిర్మాణ స్థలాల్లో ఇటుకలు,ఇసుక మోసే బేల్దారులుగా,సెంట్రింగ్ కూలీలుగా దుర్భర జీవితం గడుపుతున్నారు. శ్రామికనగర్,మౌలాలీ, ఫిలింనగర్,నేతాజీనగర్ లాంటి లేబర్ బస్తీల్లో రేకుల షెడ్లలో నివసిస్తున్నారని చెప్పారు.
బీసీ.డీలో తీవ్ర అన్యాయనికి గణాంకాల సాక్ష్యం అన్నారు.
ప్రస్తుతం సగర కులం బి సి డి సీరియల్ నెంబర్ 31లో ఉంది. బి సి డి గ్రూపులో మున్నూరుకాపు,యాదవ,గొల్ల,పద్మశాలి లాంటి బలమైన,భూస్వామ్య, విద్యావంతులైన,రాజకీయ ఆధిపత్యం కలిగిన కులాలు ఉన్నాయని,వీరికి వేలాది ఎకరాల భూములు,విద్యా సంస్థలు,వ్యాపారాలు ఉన్నాయి. వీరితో మమ్మల్ని పోల్చడం సరికాదన్నారు. అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్-1,2, 3,4 ఉద్యోగాల్లో, మెడికల్,ఇంజనీరింగ్ సీట్లలో బిసి డి కోటాలో 98 శాతం పైగా సీట్లను ఈ బలమైన కులాలే దక్కించుకుంటున్నాయని, మా సగరులు 8వ తరగతిలోనే బడి మానేసే సగర బిడ్డలు, కోచింగ్ కు లక్షలు కట్టలేని వలస కూలీలుగా,సగర బిడ్డలు వారితో పోటీ పడలేకపోతున్నారన్నారు. ఫలితంగా బిసిడిలో సగరుల వాటా వాస్తవంగా 0 శాతం కి చేరిందని,ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానుల మధ్య సమానత్వం) సూత్రానికి పూర్తి విరుద్ధంఅన్నారు. బీసీ ఏ
గ్రూపు అత్యంత వెనుకబడిన, సంచార,విముక్త జాతులు, చేతివృత్తుల శ్రామిక కులాల కోసం ఉద్దేశించబడింది.వడ్డెర కులం బి సిడి లో నుంచి బీసీఏలోకి మార్చారని, వడ్డెరలు మట్టి,రాతి పనులు చేస్తారు.సగరలు కూడా అదే పని చేస్తారు.ఒకే పని చేసే రెండు సోదర కులాల్లో ఒకటి బీసీఏలో,మరొకటి బిసిడి లో లో ఉండడం తీవ్ర అసమానతలకు దార్తీస్తుందన్నారు.రజక, నాయీబ్రాహ్మణ,మేదరి, పూసల కులాలతో సగర కులం 100 శాతం సరిపోతుందని కాబట్టి బీసీ ఏ మారడం న్యాయబద్ధమైన స్థానం దక్కుతుందన్నారు.ఈ డిమాండ్ వెనుక తిరుగులేని చట్టపరమైన చరిత్ర ఉంది. 1986లోనే ఎన్.కె.మురళీధర రావు కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి,సగర కులం తీవ్ర వెనుకబాటుతనాన్ని గుర్తించి బీసీఏ కి కి సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వం 15-07-1986న http://G.O.Ms.No.166 ద్వారా సగరులను బీసీఏలోకి చేర్చింది.దాదాపు ఏడాది పాటు సగర విద్యార్థులు బీసీ ఏ సర్టిఫికెట్లతో లబ్ధి పొందారని పేర్కొన్నారు. తర్వాత హైకోర్టు ఫుల్ బెంచ్ (AIR 1987 AP 53) ఆ జీవోను రద్దు చేసింది. కానీ రద్దుకు కారణం సగరులు వెనుకబడిన వారు కాదని కాదని,మొత్తం రిజర్వేషన్లు 65 శాతంకి పెంచడం వల్ల 50 శాతం పరిమితి దాటడం, అప్పట్లో శాస్త్రీయ డేటా లేకపోవడమే కారణం.నేడు ఆ లోపాలన్నీ తొలగిపోయాయన్నారు. ఈ సందర్భంగా ఈ క్రింది విధంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 1.బీసీఏలోకి
లోకి మార్పు చేసి,ఎస్ ఈ ఈ ఈ పిసి సర్వే 2024 డేటా ఆధారంగా కలెక్టర్ నివేదిక ఇచ్చి,బీసీ ఏలోకి మార్చాలి.
2.కార్పొరేషన్: ఫెడరేషన్ ను పూర్తిస్థాయి కార్పొరేషన్ గా మార్చి,పాలకమండలి నియమించి, బడ్జెట్ కేటాయించి,80-90 శాతం సబ్సిడీతో స్వయం ఉపాధి రుణాలు ఇవ్వాలి.
3.జీవో 59 సవరణ: ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో సగర సొసైటీలకు రిజర్వేషన్ పెంచి, పరిమితిని రూ.1 కోటికి పెంచి, ఈ ఎండి నుండి మినహాయింపు ఇవ్వాలి.
4.నిర్మాణ కార్మికుల గుర్తింపు: 95 శాతం  మంది నిర్మాణ కార్మికులుగా ఉన్నందున, TBOCWWB కింద 100 శాతం నమోదు,ఆరోగ్య భద్రత కార్డు, రు.10 లక్షల ప్రమాద బీమా,50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలి.
5.భగీరథ విగ్రహం: ట్యాంక్ బండ్ పై సగర భగీరథ మహర్షి విగ్రహం,జిల్లా కేంద్రంలో 1-2 ఎకరాల్లో కమ్యూనిటీ భవన్,హాస్టల్ కోసం స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నగర ఉప్పర సంఘం జిల్లా నాయకులు, మహిళా సంఘం నాయకులు, యువజన నాయకుడు తదితరులు పాల్గొన్నారు.
ఇట్టి కార్యక్రమం లో నల్లగొండ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు నేర్లకంటి రవికుమార్ సాగర్ ప్రధాన కార్యదర్శి బలుగురి కరుణాకర్ సాగర్.. కోశాధికారి కోలుగురి ప్రవీణ్ సాగర్.. మహిళా అధ్యక్షురాలు నేర్లకంటి వసంత సాగర్..మాజీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కంచర్ల అంజయ్య సాగర్..జిల్లా ఉపాధ్యక్షులు నేర్లకంటి సుధాకర్ సాగర్..ఉంగరాల వేమయ్య సాగర్..గంట వెంకన్న సాగర్..రాసాల వెంకన్న సాగర్..ఆంజనేయులు సగర.. గొల్లూరి శేఖర్ సాగర్..సురేందర్ సాగర్..యుగేందర్ సాగర్..నేర్లకంటి సత్తయ్య సాగర్.. వెంకటేష్ సాగర్.. గొల్లూరి స్వాతి సాగర్..ఉంగరాల అనిత సాగర్. రాసాల రాధిక సాగర్..రజిత సాగర్..నేర్లకంటి బిక్షపమ్మ సాగర్.. రూప సాగర్.. గొల్లూరిగీతాసాగర్.. బూరుపెల్లి హేమలత సాగర్.. నేర్లకంటి మంగమ్మ సాగర్..గంట మల్లేష్ సాగర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు