గజపతినగరంలో భక్తులతో పోటెత్తిన ఉమా రామలింగేశ్వర ఆలయం
గజపతినగరం, సూర్య: కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా గజపతినగరంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు కిషోర్ శర్మ శివుడికి ప్రత్యేక అభిషేకాలు, బిల్వార్చన, రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం మొత్తం శివనామస్మరణతో మార్మోగిపోయింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ ఈఓ శ్రీరామ్ ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ బందోబస్తు, సేవా సంఘాల సేవకులను ఏర్పాటు చేశారు.