అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన రామిరెడ్డి సురేష్ రెడ్డి
గిద్దలూరు, మేజర్‌న్యూస్ :
గిద్దలూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా రామిరెడ్డి పెద్ద నరసింహ రెడ్డి గారి కుమారులు రామిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, రామిరెడ్డి సురేష్ రెడ్డి తమ కుటుంబ సభ్యుల పేరుతో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రామిరెడ్డి సురేష్ రెడ్డి గారు అయ్యప్ప స్వామి, శివమాల, ఆంజనేయ స్వామి మాలధారణ చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించి. స్వయంగా స్వాములకు అన్నం వడ్డించి భక్తిశ్రద్ధలతో సేవలందించారు. అనంతరం ఆలయంలో తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్తీకమాస పవిత్ర సందర్భంగా భక్తులకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందని వారు తెలిపారు.