BREAKING
సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్’ పుస్తకావిష్కరణ.. హాజరైన ప్రముఖ నేతలు మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు కార్యక్రమ విజయవంతానికి ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి సమీక్ష వసతి గృహాలలో దోమతెరలు పంపిణీ అంతర్జాతీయ యుద్ధాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవే: సీడీఎస్ రాజా సుబ్రమణి! ఎంటీఎంసీ ఎన్నిక కు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కురుగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ మద్దతుదారుడు మాధవరెడ్డి నామినేషన్ శేఖర్ రెడ్డి మృతికి ఎమ్మెల్యే సంతాపం చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన రైలు బోగీలు ఆప్యాయ పలకరింపు.. ఆత్మీయ పరామర్శ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కోటి సోమవారము కాకాని శివయ్య సన్నిధిలో పోటెత్తిన భక్తులు--- వివిధ సేవా రుసుములు ద్వారా రూ.9,25,000/- ఆదాయము. సింహాన్ని బైకులతో తరిమిన ఘటన: ముగ్గురు అటవీ సిబ్బంది తొలగింపు! ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహా కుంభాభిషేక మహోత్సవం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి "వాగ్దానాల వర్షం.. అమలులో కరువు!" రైతు బతుకు బాగుపడేదెప్పుడు? హామీలు నెరవేరేదెప్పుడు? రైతు కన్నీటికి బాధ్యులెవరు? రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ కేశంనేనిపల్లి నుంచి 20 కుటుంబాలు బీఆర్ఎస్‌లో చేరిక

పత్రికా స్వేచ్ఛను కాపాడాలి: ఏపీయూడబ్ల్యూజే---+ ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
పత్రికా స్వేచ్ఛను కాపాడాలి: ఏపీయూడబ్ల్యూజే---+ ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు
గుంటూరు  న్యూస్:జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపీయూ డబ్ల్యూజే) గుంటూరు జిల్లా, నగర కమిటీల ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గుంటూరు అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మసీ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, జర్నలిస్టులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎస్.ఎన్. మీరా, జిల్లా కార్యదర్శి కె. రాంబాబు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, విధి నిర్వహణలో వారిపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు, రాజకీయ జోక్యాలు, పత్రికా స్వేచ్ఛకు ఎదురవుతున్న సవాళ్ల గురించి వివరించారు. ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తుందని, అధికారంలో ఎవరున్నా జర్నలిస్టులు స్వేచ్ఛగా ప్రశ్నించే వాతావరణం ఉండాలని పేర్కొన్నారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాత్రికేయులకు తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆందోళనకరమని, పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు సమాజంపై కూడా ఉందని వక్తలు పేర్కొన్నారు. జర్నలిస్టులు నిర్భయంగా విధులు నిర్వహించే పరిస్థితులు కల్పించాలని కోరారు. ఐజేయూ నాయకులు సుబ్బయ్య, భక్తవత్సలరావు మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యత, సంఘాల సమిష్టి పోరాటం ద్వారానే పాత్రికేయుల హక్కులు, భద్రతకు సంబంధించిన సమస్యలను సమర్థంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలమని పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ కోసం అన్ని జర్నలిస్టు సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని ప్రస్తుత తరుణంలో జర్నలిజం ప్రాధాన్యత, పత్రికా స్వేచ్ఛ, రాజకీయ జోక్యాలు, సమాజం పట్ల జర్నలిస్టుల బాధ్యతలపై తమ అభిప్రాయాలను ప్రసంగాల రూపంలో వ్యక్తం చేశారు. సీనియర్ 
పాత్రికేయులు విశాలాంధ్ర కోటిరత్నం, వార్తా భాస్కర్, ఆంధ్రజ్యోతి సౌరయ్యలను యూనియన్ నాయకులు ఘనంగా శాలువాలతో సత్కరించారు. అలాగే పత్రికా స్వేచ్ఛ, జర్నలిజం అంశాలపై ప్రసంగించిన విద్యార్థినీ విద్యార్థులను కూడా శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో సామ్నా జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు భవిరిశెట్టి వెంకటేశ్వరరావు, ఆళ్ల వీరభద్రరావు (భద్రం), కోటిరత్నం మాట్లాడుతూ జర్నలిజం అనేది కేవలం వార్తలు రాయడం మాత్రమే కాదని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి సమాజానికి బాధ్యతాయుతమైన సేవ చేయడమని అన్నారు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఏవైనా పత్రికా స్వేచ్ఛను గౌరవించాలని, జర్నలిస్టులపై దాడులకు పాల్పడే సంస్కృతికి ముగింపు పలకాలని సూచించారు. జర్నలిస్టులు కూడా వాస్తవాలు, నిష్పక్షపాత వైఖరి, సామాజిక బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర కమిటీ అధ్యక్షులు వెంకయ్య, కార్యదర్శి కార్తిక్, కమిటీ నాయకులు పరశురాం, సుజిబాబు, సుబ్బారావు, లూర్దురాజు, ప్రత్తిపాడు ,అధ్యక్ష, కార్యదర్శులు, తాడికొండ అధ్యక్ష, కార్యదర్శులు, తెనాలి, మంగళగిరి ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పత్రికా విలేకరులు, యూనియన్ సభ్యులు, సామ్నా కమిటీ ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.