వలసదారులపై బో ఫ్రెంచ్ వివాదాస్పద పోస్ట్: 'గ్రామర్' తప్పుతో సోషల్ మీడియాలో ట్రోలింగ్!
సూర్య గ్లోబల్ డెస్క్ (వాషింగ్టన్): టెక్సాస్ రైల్‌రోడ్ కమిషనర్ ఎన్నికల్లో ఓటమి పాలైన రిపబ్లికన్ పార్టీ నేత బో ఫ్రెంచ్ , సోషల్ మీడియా వేదికగా వలసదారులపైవిద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన కుటుంబం 400 ఏళ్లుగా అమెరికాలోనే నివసిస్తోందని గొప్పలు చెప్పుకుంటూ ఆయన చేసిన పోస్ట్‌లో చేసిన ఒక చిన్నఇంగ్లీష్ వ్యాకరణ తప్పు ఇప్పుడు ఆయన్ను నెట్టింట నవ్వులపాలు చేసింది. ప్రముఖ భారత సంతతి రిపబ్లికన్ నేతహర్మీత్ ధిల్లాన్ మరియు కాంగ్రెస్ సభ్యుడు డాన్ క్రెన్షాసైతం ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
400 ఏళ్లుగా ఇక్కడే ఉన్న అమెరికన్‌గా అంటూ వలసదారులను ఉద్దేశించి బో ఫ్రెంచ్ 'ఎక్స్' వేదికగా అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. ఇందులో అని రాయాల్సిన చోట ఆయన అని తప్పుగా రాశారు. దీనిపై మాజీ ట్రంప్ అధికారి హర్మీత్ ధిల్లాన్ ఘాటుగా స్పందిస్తూ, ముందుగా అది అని గ్రామర్ సరిదిద్దారు. అంతేకాకుండా, నీలాంటి అజ్ఞాని, జాత్యహంకార వ్యాఖ్యల వల్లే టెక్సాస్‌లో చాలా మంది అమెరికన్లు రిపబ్లికన్ పార్టీకి దూరమయ్యారు. దయచేసి ప్రజా జీవితం నుంచి తప్పుకుని పార్టీకి మేలు చేయండి అని మండిపడ్డారు.
మరోవైపు, రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు డాన్ క్రెన్షా స్పందిస్తూ.. 400 ఏళ్లుగా ఇక్కడే ఉండి కూడా సరైన ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోలేకపోయావా? అంటూ ఎద్దేవా చేశారు. గత సెప్టెంబర్‌లోనూ టెక్సాస్ యూనివర్సిటీలోని దక్షిణాసియా, భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని బో ఫ్రెంచ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదం కారణంగానే ఇటీవలి ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జోన్ రోసెంతల్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మరోసారి వలసదారులపై అక్కసు వెళ్లగక్కబోయి సొంత పార్టీ నేతల చేతిలోనే భంగపడ్డారు.