పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కు డ్రోన్ టెక్నాలజీతో నిఘా
ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ నిర్వహణకు పటిష్ట భద్రతా చర్యలు
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్.గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తూ విస్తృత నిఘా ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రాల పరిసర ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రదేశాలు, సమస్యాత్మక ప్రాంతాలపై డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నామినేషన్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలిగించరాదని జిల్లా పోలీసులు సూచించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.