BREAKING
ప్రధాన డ్రెయిన్లలో పూడికతీత పనులను తక్షణమే పూర్తి చేయాలి --నగర కమిషనర్ మయూర్ అశోక్ మార్కాపురం జిల్లాలో కరవు నివారణ మరియు సమగ్ర ఉపశమన చర్యలకు పెద్దపీట: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కు డ్రోన్ టెక్నాలజీతో నిఘా సెన్సెక్స్ టార్గెట్ 95,000: భారత మార్కెట్లపై మోర్గాన్ స్టాన్లీ బుల్లిష్ అంచనా! స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో గ్రంథాలయ ఉద్యమ నిర్మాణం - విశ్రాంత అధికారి పి.వి. మల్లేశ్వర్ అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన రామిరెడ్డి సురేష్ రెడ్డి గజపతినగరంలో భక్తులతో పోటెత్తిన ఉమా రామలింగేశ్వర ఆలయం టిటిడి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి సమాజంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివి .... సంచలనాలు కాదు మీడియాకు సమాజ సేవ ముఖ్యం ఈవీఎం గోదామును సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆసియా మార్కెట్లకు దీటుగా భారత స్టాక్ మార్కెట్లు: 82 వేలకుపైన సెన్సెక్స్! గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ & కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలి :జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి పిల్లల సమస్యల పరిష్కారానికి ‘పిల్లల ప్రజావాణి’

విదేశీ ఉద్యోగాలపై నిరుద్యోగ యువతకు బంపర్‌ అవకాశం జర్మనీ, జపాన్, అమెరికా, దుబాయ్‌ సహా పలు దేశాల్లో ఉద్యోగాలు ఈ నెల 20న పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్‌ మేళా

Select Suryaa Now
విదేశీ ఉద్యోగాలపై నిరుద్యోగ యువతకు బంపర్‌ అవకాశం   జర్మనీ, జపాన్, అమెరికా, దుబాయ్‌ సహా పలు దేశాల్లో ఉద్యోగాలు  ఈ నెల 20న పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్‌ మేళా

 

సూర్య - పెద్దపల్లి: విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునే నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోంది. వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి ఎం. రాజశేఖర్ కోరారు. జిల్లా ఉపాధి కార్యాలయం, TOMCOM సంస్థ సమన్వయంతో ఈ నెల 20న పెద్దపల్లి ఐడీఓసీలోని జిల్లా ఉపాధి కార్యాలయం గది నంబర్ 233లో రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.జర్మనీ, ఆస్ట్రియా, ఐర్లాండ్, సౌదీ అరేబియా, ఖతార్, ఇజ్రాయెల్, దుబాయ్, మలేషియా, అమెరికా, జపాన్ తదితర దేశాల్లో నర్సింగ్, వైద్య సేవలు, నిర్మాణ రంగం, డ్రైవింగ్, వెల్డింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం, ఫిజియోథెరపీ, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్, పదో తరగతి విద్యార్హతలు కలిగిన వారు ఉద్యోగాలను బట్టి అర్హులని వివరించారు. కొన్ని ఉద్యోగాలకు అనుభవం, నర్సింగ్ లైసెన్స్, IELTS లేదా OET అర్హతలు అవసరమవుతాయని తెలిపారు.ఆసక్తి, అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ నెల 20న నిర్వహించే మేళాకు విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, ఇతర సంబంధిత పత్రాలతో హాజరై పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 080 3552 4946, 8985336947, 8121262441 నంబర్లను సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి కోరారు.