BREAKING
చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన రైలు బోగీలు ఆప్యాయ పలకరింపు.. ఆత్మీయ పరామర్శ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కోటి సోమవారము కాకాని శివయ్య సన్నిధిలో పోటెత్తిన భక్తులు--- వివిధ సేవా రుసుములు ద్వారా రూ.9,25,000/- ఆదాయము. సింహాన్ని బైకులతో తరిమిన ఘటన: ముగ్గురు అటవీ సిబ్బంది తొలగింపు! ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహా కుంభాభిషేక మహోత్సవం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి "వాగ్దానాల వర్షం.. అమలులో కరువు!" రైతు బతుకు బాగుపడేదెప్పుడు? హామీలు నెరవేరేదెప్పుడు? రైతు కన్నీటికి బాధ్యులెవరు? రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ కేశంనేనిపల్లి నుంచి 20 కుటుంబాలు బీఆర్ఎస్‌లో చేరిక పలమనేరు శివాలయంలో ప్రత్యేక పూజలు ఇంకెన్నాళ్లు వైసీపీ దౌర్జన్యాలను చూస్తూ ఉండాలి-- జైలు వద్ద పోలీస్ అధికారులపై దాడి అత్యంత హేయం-- గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు! గృహ స్థలాల రెగ్యులరైజేషన్ విచారణ పక్కాగా ఉండాలి--జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు! పోలాండ్‌లో ఉగ్రకుట్ర భగ్నం: ముగ్గురు టీనేజర్లు అరెస్ట్! నగర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి.. పబ్లిక్ హెల్త్, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి: ఏపీయూడబ్ల్యూజే---+ ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు

తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి

Select Suryaa Now
తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి

బాపట్ల, మేజర్‌న్యూస్ :

తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని వీక్షణ సమావేశ మందిరంలో రెండవ సాధారణ సంస్థల ఎన్నికల ఏర్పాట్లు, ఓటరు జాబితా సవరణ, తుఫాను ముందస్తు చర్యలపై అధికారులతో ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు.  

     ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి  మాట్లాడుతూ,తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రధాన కాలువలు, డ్రైనేజీలలో పూడిక, అడ్డంకులను తక్షణమే తొలగించాలన్నారు.  అవసరమైన చోట జేసీబీలు, ట్రాక్టర్లు వినియోగించి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను విద్యుత్ శాఖ సిబ్బంది ముందస్తుగా తొలగించాలని, తొలగించిన కొమ్మలను రోడ్లపై, ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రదేశాల్లో వదిలివేయకుండా సక్రమంగా తరలించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. తుఫాను సహాయక చర్యలకు అవసరమైన యంత్రాలు, పరికరాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని, పరిస్థితులను ప్రతిరోజూ సమీక్షించాలని అధికారులకు తెలిపారు.

    మత్స్యకారుల భద్రతకు,సముద్ర తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు, పడవల యజమానులను సాగరమిత్రలు, గ్రామ మత్స్య సహాయకులు వ్యక్తిగతంగా సంప్రదించి తుఫాను హెచ్చరికలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి మత్స్యశాఖ అధికారులకు సూచించారు. సముద్రంలో ఉన్న పడవలు, ఇతర మత్స్యకార నౌకలను సురక్షితంగా తీరానికి చేర్చి, లంగరు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియను ఫొటోలతో సహా ధృవీకరించి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.

    తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన చోట పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి అధికారులకు సూచించారు. ప్రజలకు ఆహారం, తాగునీరు, వైద్య సహాయం వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆయన చెప్పారు. సహాయ కేంద్రాల్లో ఆశ్రయం పొందిన అర్హులైన వారికి సహాయం అందేలా తహసీల్దార్లు, ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధృవీకరించాలని ఆయన సూచించారు.

    ఓటరు జాబితా సవరణకు సంబంధించి ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పెండెన్సీని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి సమీక్షించారు. నిర్దేశిత గడువులో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హత మేరకు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి, సంబంధిత బూత్ స్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తులు, ఇతర పెండింగ్ అంశాలను కూడా నిర్దేశిత గడువులో పరిష్కరించాలని ఆయన సూచించారు.

    మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అభ్యర్థులకు నామినేషన్ ప్రక్రియపై స్పష్టమైన సమాచారం అందించి, అవసరమైన ధ్రువపత్రాల వివరాలను ముందుగానే తెలియజేయాలని ఆయన సూచించారు. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు.ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బంది విషయంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, వారి వివరణలను ఏ అధికారి స్వీకరించకుండా, నేరుగా జిల్లా కలెక్టర్ వారిని సంప్రదించి వారి వివరణను అందజేయాలని ఆయన అధికారులకు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రత్యేకంగా నమోదు చేసి, వాటి పరిష్కార స్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆయన సూచించారు.

    పోలింగ్ కేంద్రాల్లో తగినంత వెలుతురు, తాగునీరు, పారిశుద్ధ్యం, ర్యాంపులు, అవసరమైన ఫర్నిచర్ వంటి సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. శిథిలమైన వస్తువులు, పనికిరాని ఫర్నిచర్‌ను తొలగించి ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వర్షాలు, తుఫాను కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న కేంద్రాలను ముందుగానే గుర్తించి, అవసరమైతే సురక్షితమైన ప్రత్యామ్నాయ భవనాలకు మార్చే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించి, గతంలో చోటుచేసుకున్న సంఘటనల వివరాలను సేకరించాలని, ప్రతి గ్రామ పంచాయతీకి అనువైన కౌంటింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని పనులను బాధ్యతగా నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. తుఫాను ముందస్తు చర్యలు, ఎన్నికల ఏర్పాట్లు, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా సమన్వయంతో అధికారులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

     ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ శ్రీనివాస్ నాయక్, డిడి గాలి దేముడు, డ్వామా పిడి విజయలక్ష్మి, సర్వ శిక్ష అభియాన్ పిడి శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏవో మల్లికార్జున రావు, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయ సమన్వయ అధికారి యశ్వంత్,  మత్స్యశాఖ సిబ్బంది, వీక్షణ సమావేశం ద్వారా ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, విద్యుత్ శాఖ అధికారులు, బాపట్ల, చీరాల,రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారులు, అన్ని మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బంది  మరియు తదితరులు పాల్గొన్నారు.