టిటిడి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం
(కల్చరల్) సూర్య: కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా పట్టణంలోని టిటిడి కళ్యాణ మంటపం ప్రాంగణంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ,భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవం నిర్వహించారు.ఆలయ అర్చకులు శ్రీమాన్ పాణంగిపల్లినరసింహాచార్యులు నిర్వహించిన ఈకార్యక్రమంలో భక్తులు విచ్చేసి శ్రీ స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఆలయంవద్దగల చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు.