telangana
రాబోయే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించేందుకు బీసీ దళ్ రెడీ:తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు డి.వి.వి. సత్యనారాయణ
తెలంగాణ బ్యూరో, ప్రతినిధి: బీసీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తేనే వారు అభివృద్ధి చెందుతారని నేషనల్ బీసీ దళ్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు డి.వి.వి. సత్యనారాయణ అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ప్రత్యేకించి బీసీ కులాలకు తీరని నష్టం వాటిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా బీసీ కులాలలో ఉన్న ప్రముఖులకు గౌరవం ఇవ్వడంతో పాటు ఆయా కులాలకు సంబంధించిన వారికి రాజకీయ అవకాశాలు కల్పించాలని సూచించారు. బీసీలకు రాజకీయంగా వాట దక్కితేనే రాణిస్తారు అని అన్నారు. సమాజంలో అత్యధిక శాతం జనాభా ఉన్న బీసీలకు తెలుగు రాష్ట్రాలలో
రాజకీయాల్లో అవకాశాలు వస్తే విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుతారు అని అన్నారు. బీసీలను చైతన్యం చేసేందుకు నేషనల్ బీసీ దళ్ కృషి చేస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లోనైనా బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించేందుకు బీసీ దళ్ రెడీ గా ఉందన్నారు. రాజకీయాలు అంటే సేవా తత్పరతతో ఉండాలని తద్వారా సమాజానికి మరింత మేలు జరుగుతుందని అన్నారు. జాతీయ బీసీ దళ్ ఉత్తరాది రాష్ట్రాలలో బీసీలకు అవకాశాలు కల్పించిందని భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలలో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తుందని అన్నారు