telangana
పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఏసీబీకి వినతి
హైదరాబాద్ సిటీ బ్యూరో, మేజర్ న్యూస్ (నవంబర్ 16): హిమాయత్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవి కిరణ్ ని కలిసి హిమాయత్ నగర్ డివిజన్లో రాంకీ సంస్థ సరిగ్గా పని చేయట్లేదు అని చెత్త కుప్పలు, మట్టి కుప్పలు ఎక్కడికక్కడే జమాయి ఉంటుందని దాని వల్ల దోమలు వ్యాపించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆమె ఏసీని కోరారు. ఇక్కడ పేర్కొన్న సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాన్ని ఇచ్చారు. దీనికి అడిషనల్ కమిషనర్ కిరణ్ స్పందిస్తూ వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.