andhrapradesh
నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల సందడి--పాల్గొన్న ఎంపీ లావు, ఎమ్మెల్యే చదలవాడ
నరసరావుపేట: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమం ఉత్సాహ భరిత వాతావరణంలో జరిగింది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నాగసరపు రూపేష్ గుప్తాతో పాటు వివిధ వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా తనయుడైన రూపేష్ గుప్తా నామినేషన్ కార్యక్రమంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొని అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి నాయకులు అభ్యర్థులకు తమ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఇన్‌చార్జ్ జాన్ సైదా, నల్లపాటి రాము, జనసేన పార్టీ నాయకులు జిలానీతో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.నామినేషన్ల కార్యక్రమం సందర్భంగా పసుపు జెండాలు, పార్టీ కండువాలతో పట్టణంలోని ప్రధాన వీధులు సందడిగా మారాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తల నినాదాల మధ్య అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం కొనసాగింది. యువ నాయకత్వానికి ప్రాధాన్యతనిస్తూ అనుభవజ్ఞుల మార్గదర్శ కత్వంలో పట్టణ అభివృద్ధి, ప్రజాసేవ లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమం లో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.