BREAKING
అంతర్జాతీయ యుద్ధాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవే: సీడీఎస్ రాజా సుబ్రమణి! ఎంటీఎంసీ ఎన్నిక కు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి కురుగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ మద్దతుదారుడు మాధవరెడ్డి నామినేషన్ శేఖర్ రెడ్డి మృతికి ఎమ్మెల్యే సంతాపం చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన రైలు బోగీలు ఆప్యాయ పలకరింపు.. ఆత్మీయ పరామర్శ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కోటి సోమవారము కాకాని శివయ్య సన్నిధిలో పోటెత్తిన భక్తులు--- వివిధ సేవా రుసుములు ద్వారా రూ.9,25,000/- ఆదాయము. సింహాన్ని బైకులతో తరిమిన ఘటన: ముగ్గురు అటవీ సిబ్బంది తొలగింపు! ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహా కుంభాభిషేక మహోత్సవం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి "వాగ్దానాల వర్షం.. అమలులో కరువు!" రైతు బతుకు బాగుపడేదెప్పుడు? హామీలు నెరవేరేదెప్పుడు? రైతు కన్నీటికి బాధ్యులెవరు? రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ కేశంనేనిపల్లి నుంచి 20 కుటుంబాలు బీఆర్ఎస్‌లో చేరిక పలమనేరు శివాలయంలో ప్రత్యేక పూజలు ఇంకెన్నాళ్లు వైసీపీ దౌర్జన్యాలను చూస్తూ ఉండాలి-- జైలు వద్ద పోలీస్ అధికారులపై దాడి అత్యంత హేయం-- గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు!

జనగణనలో ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ ఇచ్చి శాస్త్రీయంగా లెక్కించాలి వచ్చే పార్లమెంట్ సమావేశంలోనే రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలి-- సంచారజాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసల రవి డిమాండ్

Select Suryaa Now
జనగణనలో ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ ఇచ్చి శాస్త్రీయంగా లెక్కించాలి వచ్చే పార్లమెంట్ సమావేశంలోనే రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలి-- సంచారజాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసల రవి డిమాండ్

పలమనేరు మేజర్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న జనగణనలో కులగణన చేపట్టేందుకు ముందుకు రావడాన్ని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. ఇది చాలా ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమైనా, సరైన దిశలో వేసిన అడుగు.కానీ కేవలం కులగణన అంటే సరిపోదు. అది శాస్త్రీయంగా, పారదర్శకంగా, ఎలాంటి లోపాలు లేకుండా జరగాలి. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మేము గట్టిగా కోరుతున్నది ఒక్కటే…

ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ ఇవ్వాలి.ఒక్కో కులానికి ఒక్కో కోడ్ నంబర్ కేటాయించి, ఆ కోడ్ ప్రకారమే జనాభా లెక్కించాలి. అప్పుడే ఏ కులం ఎంత ఉందో, ఏ కులం సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఎంత వెనుకబడి ఉందో ఖచ్చితమైన లెక్కలు బయటకు వస్తాయి. కోడ్ లేకుండా చేసే లెక్కింపు వల్ల బీసీలు, సంచారజాతులు, అత్యంత వెనుకబడిన వర్గాలు మళ్లీ నష్టపోతాయి. మా జనాభాను తక్కువ చేసి చూపించే కుట్రలకు ఇక తావు ఉండకూడదు.దేశంలో అత్యధిక జనాభా కలిగిన వర్గం బీసీలే. అయినా నేటికీ ఉద్యోగాల్లో, ముఖ్యంగా పదోన్నతుల్లో బీసీలకు న్యాయం జరగడం లేదు. ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ ఉన్నట్లే, బీసీలకు కూడా ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని ఇప్పటికే పలు కమిషన్లు సిఫార్సు చేశాయి.పదోన్నతుల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు చట్టపరంగా, రాజ్యాంగపరంగా, న్యాయపరంగా ఎలాంటి అవరోధాలు లేవు. కావాల్సింది కేవలం కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి, రాజకీయ సంకల్పం మాత్రమే.కాబట్టి రాబోయే పార్లమెంట్ సమావేశంలోనే రాజ్యాంగ సవరణ చేపట్టి, బీసీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.ఇది కేవలం సంచారజాతుల డిమాండ్ కాదు. కోట్లాది మంది బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన డిమాండ్. మా జనాభాకు తగిన వాటా, మా హక్కులు మాకు కావాలి.కులగణనలో కోడ్ విధానం అమలు చేయకపోతే, ప్రమోషన్లలో రిజర్వేషన్ అమలు చేయకపోతే, బీసీలు, సంచారజాతులు ఊరుకోవు. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి.

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్