బస్వాపూర్ ముదిరాజ్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బోయిని గోపాల్
బంట్వారం, మేజర్ న్యూస్ : మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో గురువారం ముదిరాజ్ సంఘం గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు మెహన్ ముదిరాజ్, యువజన అధ్యక్షుడు నరేష్ ఆధ్వర్యంలో గ్రామాధ్యక్షుడిగా బోయిని గోపాల్ ముదిరాజ్, ఉపాధ్యక్షులుగా పూలపల్లి హన్మంతు, సంకూరు శ్రీనివాస్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యువజన అధ్యక్షుడిగా సీత నవీన్, ఉపాధ్యక్షుడిగా పులిపల్లి సాయి ఎన్నికయ్యారు. గ్రామ అధ్యక్షుడు బోయిని గోపాల్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఎన్నికైన యూత్ కమిటీ సభ్యులు సంఘం అభివృద్ధికి, ముదిరాజ్ యువత ఐక్యతకు కృషి చేయాలన్నారు. యువతను సంఘటితం చేస్తూ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాలని ఆయన ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శాఖ రాములు, సంఘం నాయకులు, హన్మయ్య, లక్ష్మయ్య, నర్సింలు, బాలయ్య, పురుషోత్తం, రాచన్న, నరేష్, ప్రభు ఉన్నారు.