ముగిసిన సంగ్రామం.. మరో సంగ్రామానికి సిద్ధం కావాలి! కూటమి విజయంలో యువత, సీనియర్ నాయకుల కృషి కీలకం రెండోసారి ఎంపీపీగా విజయం సాధించిన శీలం వెంకటేశ్వరరావు
టి. నరసాపురం,మేజర్ న్యూస్: ఎన్నికల సంగ్రామంలో చివరకు కూటమి విజయం సాధించిందని ఎంపీపీ శీలం వెంకటేశ్వరరావు అన్నారు. రెండోసారి ఎంపీపీగా విజయం సాధించిన అనంతరం గురువారం టి. నరసాపురం మాజీ వైస్ ఎంపీపీ అద్దంకి జగ్గారావు నివాసం వద్ద నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ విజయం తన వ్యక్తిగత విజయం కాదని, కూటమి సమష్టి విజయమని పేర్కొన్నారు. కూటమి గెలుపు కోసం యువత ముందుండి పనిచేయడంతో పాటు, సీనియర్ నాయకులు అందించిన సహకారం ఎంతో కీలకమని కొనియాడారు. మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలకు గాను 10 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు.కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి ఇచ్చిన మాట ప్రకారం వైస్ ఎంపీపీ పదవిని తిరుమలదేవిపేట ఎంపీటీసీ సభ్యుడు, జనసేన నాయకుడు కలపాల సీతారాముడికి కేటాయించినట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.ఒక సంగ్రామం ముగిసిందని, మరో సంగ్రామానికి సిద్ధం కావాలని పేర్కొంటూ,టి. నరసాపురం సర్పంచ్ అభ్యర్థిగా కూటమి తరఫున బరిలో ఉన్న చాట్రాతి యుగంధర్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత కూటమిలోని ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పేదలు వైద్య సేవల కోసం ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్), ఎల్‌ఓసీల మంజూరుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు,కూటమి కార్యకర్తలు తో పాటు నాయకులు వంటిపల్లి వెంకటేశ్వరరావు, సందేపూడి ఫణి, జొనుబోయిన శోంభాబు, సీహెచ్ నవీన్, కిలారీ సాంబశివరావు,కొల్లి మురళి, కే. రాంబాబు, వెలిది నాగబాబు తదితరులు పాల్గొని నూతన ఎంపీపీ శీలం వెంకటేశ్వరరావుకు అభినందనలు తెలిపారు.
క్రైమ్ రిపోర్టర్ అద్దంకి గిరి కుమార్ ఏలూరు జిల్లా,