BREAKING
ప్రపంచ వాతావరణ నాయకత్వంపై చైనా వెనకడుగు రేవంత్ రెడ్డి తీరుతో కలుషితమవుతున్న తెలంగాణ రాజకీయాలు ఎమ్మెల్సీ డా. యాదవ రెడ్డి బ్రిటన్, ఈయూ మధ్య కీలక ఒప్పందాలు రూ.1.15 కోట్ల విలువైన అక్రమ సిగరెట్లు స్వాధీనం .. విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ రామాయపట్నం పోర్టుకు కస్టమ్స్ హోదా.. మా విజన్ సాకారమవుతోంది: వైఎస్ జగన్ పాలమాకుల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇనుప ఖనిజం, బొగ్గు, విద్యుత్ జోరు మహిళా డిగ్రీ కళాశాలలో ముగిసిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అలింకో ఆధ్వర్యంలో వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి - మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట అభివృద్ధికి.. తెలంగాణ ఉద్యమానికి మదన్ మోహన్ సేవలు చిరస్మరణీయం! శతవసంతాల శిఖరం చుక్కా రామయ్యకు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నికల విధుల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలు :జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి బాడంగి గ్రంథాలయంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు ఎంవీఎస్ కళాశాలకు పరిశోధనా కేంద్రం మంజూరు బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని అరికట్టాలి

తిరుపతి లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

Select Suryaa Now
తిరుపతి లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్ 

తిరుపతి లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

దృఢ సంకల్పం, ధైర్యసాహసాలతో దేశ రూపురేఖలను మార్చిన 'ఉక్కు మహిళ' ఇందిరాగాంధీ

కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్భన్ జిల్లా అధ్యక్షులు గౌడపేర చిట్టిబాబు


భారతదేశపు తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ ఆధునిక భారత నిర్మాణంలో  చారిత్రాత్మక పాత్రను పోషించారని తన దృఢ సంకల్పం, ధైర్యసాహసాలతో దేశ రూపురేఖలను మార్చిన 'ఉక్కు మహిళ'గా ఆమె చరిత్రలో నిలిచిపోయారని కాంగ్రెస్ తిరుపతి అర్భన్ జిల్లా అధ్యక్షులు గౌడపేర చిట్టిబాబు అన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ తిరుపతి అర్భన్ జిల్లా అధ్యక్షులు గౌడపేర చిట్టిబాబు ఆధ్వర్యంలో గురువారం తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఆమె చిత్ర పటం ఉంచి రోజాపూలమాల వేసి కర్పూర నీరాజనాలు పట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా ప్రధానమంత్రి గా ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రగతికి పునాదులు వేశాయని వివరించారు. ఆమె మనవడి గా రాహుల్ గాంధీ నేడు దేశ భద్రత, ప్రగతికి అటు పార్లమెంట్ లోపల బయట రాజీలేని పోరాటం చేస్తున్నారని చెప్పారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అభివృద్ధికి ఇందిరమ్మ ఎంతో ప్రోత్సాహం అందించారని1975లో భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం 'ఆర్యభట్ట' ప్రయోగం, అలాగే 1984లో తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర ఆమె హయాంలోనే జరిగాయని చెప్పారు.ఆర్థిక, రక్షణ, వ్యవసాయ మరియు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆమె వేసిన బలమైన పునాదులు నేటికీ భారతదేశ ప్రగతికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలియజేశారు.

పీసీసీ  ఉపాధ్యక్షుడు దొడ్డ రెడ్డి రాంభూపాల్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాంగాటి గోపాల్ రెడ్డి లు మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరమ్మ జీవితం ఆదర్శప్రాయం అన్నారు.దేశంలో తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్న సమయంలో, ఇందిరా గాంధీ హరిత విప్లవాన్ని  ప్రోత్సహించారని వివరించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, సాగునీటి సౌకర్యాలను కల్పించడం ద్వారా భారతదేశాన్ని ఆహార దిగుమతులపై ఆధారపడే స్థితి నుండి ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. పేదల కడుపు నింపడానికి రైతుల అభ్యున్నతికి అవసరమైన చర్యలను తీసుకొని ప్రపంచ దేశాల మన్ననలు పొందారని అన్నారు. నేటి పాలకులకు మార్గదర్శకంగా నిలిచారని వారు కొనియాడారు. రాజభరణాల రద్దు మరియు సిక్కిం విలీనం ఆమె తీసుకున్న నిర్ణయాలు యావత్ ప్రజల ప్రశంసలు అందుకునిందని చెప్పారు.అంతర్జాతీయ వేదికలపై అలీనోద్యమానికి నాయకత్వం వహించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ కోసం 'ప్రాజెక్ట్ టైగర్' వంటి కార్యక్రమాలను ప్రారంభించి ఇందిరా గాంధీ తన దూరదృష్టిని చాటుకున్నారని చెప్పారు.


పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ బ్యాంకుల జాతీయీకరణ
సామాన్య ప్రజలకు, రైతులకు, చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో 1969లో 14 ప్రధాన వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారని  తెలియజేశారు. ఈ సాహసోపేత నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని అన్నారు. ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయం తోనే గ్రామీణ ప్రాంతాల్లో సైతం బ్యాంకింగ్ విస్తరణ సాధ్యమైందన్నారు.భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ 1974 మే నెలలో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో తొలి అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. దీనితో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాల తర్వాత అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఆరో దేశంగా భారత్ అవతరించిందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నన్నే ఖాన్, ఏఐసీసీ ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ కంభంపాటి మురళీకృష్ణ, బీసీ సెల్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బయలు గోపి గౌడ్, కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి గోపీచంద్, ఉపాధ్యక్షుడు పార్థసారధి రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ థవన్ కళ్యాణ్, ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ బోయిన నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి