BREAKING
ఇందిరమ్మ బీమా పథకంతో ప్రతి కుటుంబానికి భరోసా పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మాపూర్ గ్రామం ఎంపిక సర్పంచ్ కు 71, వార్డుకు 366 నామినేషన్లు “3వ వార్డులో ప్రచార జోరు.. రూపేష్ గుప్తాకు నేతల మద్దతు ఘనంగా ప్రారంభమైన 'అంతార్ డెజర్ట్స్' యూరోపియన్ బ్యాంకింగ్ రంగంలో ఆర్సెల్ సంచలన విజయం శివాలయం ఉప ప్రధానార్చకులు జాలయ్య ఆకస్మిక మృతి సిద్దిపేట సభ అనంతరం ప్రమాదంలో మృతి చెందిన కొమ్ము సారవ్వ కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శ.. గుండ్లకొండ సర్పంచ్ గా లక్ష్మి ఏకగ్రీవం పామూరు జడ్పీటీసీగా జాహ్నవి బాధ్యతలు స్వీకారం పండుగ సీజన్ అంచనాలపై నీలినీడలు.. రాస్ స్టోర్స్ షేర్లు కుదేలు సర్పంచ్ బోయిని సంపత్ తండ్రి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన కోహెడ మండల బిఆర్ఎస్ నాయకులు. కెనడా రిటైల్ అమ్మకాలు సెప్టెంబర్‌లో 0.8 శాతం వృద్ధి నీటిని వృదాచేస్తే ఇబ్బందులు తప్పవు

శతవసంతాల శిఖరం చుక్కా రామయ్యకు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

Select Suryaa Now
శతవసంతాల శిఖరం చుక్కా రామయ్యకు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్: శతవసంతాలను పూర్తి చేసుకున్న ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య గారిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. చుక్కా రామయ్య గారి జన్మదినోత్సవం యావత్ తెలంగాణ ప్రజలకు, విద్యా వ్యవస్థకు ఒక గొప్ప పర్వదినమని అభివర్ణించారు.

తెలంగాణ గర్వించదగ్గ విద్యావేత్త

స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ చుక్కా రామయ్య క్రియాశీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. సామాన్యులకు, విద్యార్థులకు 'ఐఐటీ' అనే పదాన్ని పరిచయం చేసిన గొప్ప విద్యావేత్త అని కొనియాడారు. కేవలం విద్యావేత్తగానే కాకుండా, శాసనమండలి సభ్యుడిగా కూడా ఈ ప్రాంత అభివృద్ధిపై తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు.

మండలిలో పోరాట పటిమ.. నాటి జ్ఞాపకాలు

శాసనమండలిలో చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి మేధావులతో కలిసి పనిచేయడం తన అదృష్టమని, ఆ విషయాన్ని ఎంతో గర్వంగా చెప్పుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. మండలిలో ప్రజా, సామాజిక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా, వాటికి నిర్మాణాత్మక పరిష్కారాలను కూడా రామయ్య సూచించేవారని గుర్తుచేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కళాశాల లేదన్న విషయాన్ని ఆయన మండలిలో ప్రస్తావించే వరకు ఎవరికీ తెలియదని, ఆయన చొరవతోనే అప్పట్లో ప్రభుత్వం డిగ్రీ కళాశాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు.

ఆయన ఆలోచనలే ప్రభుత్వానికి మార్గదర్శకం

చుక్కా రామయ్య వంటి మహానీయులు కాలానికి, రాజకీయాలకు అతీతులని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లుతూ అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. రామయ్య గారి ఆలోచనలు, సలహాలు, సూచనల మేరకే తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ జర్నలిస్టు కె. రామచంద్రమూర్తి తదితర ప్రముఖులు పాల్గొని చుక్కా రామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.