BREAKING
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి ప్రజల సంక్షేమమే నాధ్యేయం సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య అరుదైన ఊపిరితిత్తుల వ్యాధి ఔషధంపై ఎఫ్‌డీఏ జాప్యం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి... సేంద్రియ సాగుతో అధిక లాభాలు.. రైతులకు శాస్త్రవేత్తల సూచనలు మోమిన్ కలాన్‌లో చేయూత పింఛన్ ధ్రువపత్రాల పంపిణీ మోమిన్ కలాన్‌లో చేయూత పింఛన్ ధ్రువపత్రాల పంపిణీ అదనపు వెల్లడి నిబంధనల తొలగింపునకు సెబీ ప్రతిపాదన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి: సర్పంచ్ రోజా రమేష్ బడుగు బలహీన వర్గాలకే సంక్షేమ ఫలాలు డేటా సెంటర్లకు స్పెయిన్ కఠిన హరిత నిబంధనలు ఇందిరమ్మ బీమా పథకంతో ప్రతి కుటుంబానికి భరోసా పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మాపూర్ గ్రామం ఎంపిక సర్పంచ్ కు 71, వార్డుకు 366 నామినేషన్లు “3వ వార్డులో ప్రచార జోరు.. రూపేష్ గుప్తాకు నేతల మద్దతు

తంగళ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Select Suryaa Now
తంగళ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ ;  కోహెడ మండలం  నవంబర్ 26 వ తేదీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ తో పాటు 4.75 లక్షల నూతన చేయూత పింఛన్లకు అకౌంట్ లో డబ్బులు జమ కోహెడ మండలంలోని తంగళ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగంగా నమోదు ప్రక్రియను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. నిన్న ఇందిరమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారని, దేశంలోనే తొలిసారిగా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించే గొప్ప కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.
గతంలో ఎక్స్‌గ్రేషియా వంటి ఆర్థిక సహాయాలు ప్రధానంగా భూమి కలిగిన రైతులకు మాత్రమే పరిమితమయ్యేవని, కానీ ప్రజాపాలన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఏ వృత్తిలో ఉన్నా, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించనున్నామని తెలిపారు. ఈ పథకంలో లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని, మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అర్హులైన కుటుంబాలు సంబంధిత ఫారమ్ ద్వారా నమోదు చేసుకుంటే సరిపోతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 12 వేల గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీడీవో, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములై ప్రతి కుటుంబానికి ఈ పథకం చేరేలా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కుటుంబాలకు జీవిత బీమా భద్రత కల్పించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. అదే రోజు రాష్ట్రంలో కొత్తగా నూతన చేయుత పింఛన్లకు అకౌంట్ లో డబ్బులు జమ కానున్నాయని తెలిపారు. ప్రభుత్వం వేస్తుంది. ప్రజాపాలన ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ప్రజల సంక్షేమం కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపడుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, ఇళ్లు లేని అర్హులైన మిగిలిన కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఇళ్లను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజల సంక్షేమం, ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, ప్రతి పేదవారికి సొంత ఇల్లు కల్పించడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.