జడ్పీ చైర్మన్ సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్‌పర్సనుగా తలారి శరణ్యలు ఎంపిక : మంత్రితో కలిసి ఘనంగా సన్మానించిన శ్రీరామ్ చినబాబు
మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా పరిషత్ నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్‌పర్సన్ తలారి శరణ్య,చిన్నమండెం మండలం జెడ్పీటీసీ లక్ష్మి ప్రసాద్ రెడ్డికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు,మదనపల్లె మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఇందులో భాగంగా వారిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు.జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కృషిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ ఇప్పటికే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సారాధ్యంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తోందని,జడ్పీ చైర్మన్ సుగవాసి ప్రసాద్ బాబు ఎంపిక కావడం శుభపరిణామమని,వీరి కలయికలో జిల్లా మరింత ప్రగతి పథంలో నడవాలని ఆకాంక్షించారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి