BREAKING
ఇందిరమ్మ బీమా పథకంతో ప్రతి కుటుంబానికి భరోసా పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మాపూర్ గ్రామం ఎంపిక సర్పంచ్ కు 71, వార్డుకు 366 నామినేషన్లు “3వ వార్డులో ప్రచార జోరు.. రూపేష్ గుప్తాకు నేతల మద్దతు ఘనంగా ప్రారంభమైన 'అంతార్ డెజర్ట్స్' యూరోపియన్ బ్యాంకింగ్ రంగంలో ఆర్సెల్ సంచలన విజయం శివాలయం ఉప ప్రధానార్చకులు జాలయ్య ఆకస్మిక మృతి సిద్దిపేట సభ అనంతరం ప్రమాదంలో మృతి చెందిన కొమ్ము సారవ్వ కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శ.. గుండ్లకొండ సర్పంచ్ గా లక్ష్మి ఏకగ్రీవం పామూరు జడ్పీటీసీగా జాహ్నవి బాధ్యతలు స్వీకారం పండుగ సీజన్ అంచనాలపై నీలినీడలు.. రాస్ స్టోర్స్ షేర్లు కుదేలు సర్పంచ్ బోయిని సంపత్ తండ్రి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన కోహెడ మండల బిఆర్ఎస్ నాయకులు. కెనడా రిటైల్ అమ్మకాలు సెప్టెంబర్‌లో 0.8 శాతం వృద్ధి నీటిని వృదాచేస్తే ఇబ్బందులు తప్పవు

అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్

Select Suryaa Now
అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది :  రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్ నూతన పాలకవర్గ ఎన్నిక, తదుపరి తొలి సమావేశం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. జిల్లా పరిషత్ తొలి సమావేశానికి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ పూషడపు రోహిణి అధ్యక్షత వహించారు. ఎన్నికైన సభ్యులందరికీ కరచాలనం చేసి, పూల మొక్కలతో మంత్రి అభినందనలు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ను మంత్రి సత్యప్రసాద్ ప్రత్యేకంగా సన్మానించారు. 
       
        త్రిబుల్ ఇంజిన్ సర్కార్ గా రాష్ట్ర పురోభివృద్ధి వైపు పయనిస్తుందని మంత్రి చెప్పారు. కేంద్రంలో మోడీ సర్కార్, రాష్ట్రంలో కూటమితో నారా చంద్రబాబు నాయుడు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలు పట్టం కట్టారన్నారు. రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్లేందుకు ప్రజలు అవకాశం కల్పించడం సంతోషదాయకమన్నారు. భావితరాలు బాగుండాలని, ముఖ్యంగా మీ పిల్లలు బాగుండాలని ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ప్రగతిని కాంక్షిస్తూ రాబోయే తరాలకు ఇప్పుడే సీఎం పునాదులు వేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రగతితో పాటు నేటి నుండి పల్లె ప్రగతి జరగనుందన్నారు. గ్రామాలలో ప్రతి సమస్య పరిష్కారానికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. 
పల్లెలన్ని వికసించనున్నాయన్నారు. విజన్ 2020 లక్ష్యంతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపుతో హైదరాబాద్ ను అభివృద్ధి చేశారన్నారు. కూటమి పాలనలో బాపట్ల జిల్లా పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. జడ్పిటిసి సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, మీ అందరికీ మేము అందుబాటులో ఉంటామన్నారు. 
      
      అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, స్పష్టం చేశారు. నూతన పాలకవర్గ ఏర్పాటైనందున జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం భవన నిర్మాణానికి రూ.రెండు కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. 
       
      ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి అందించడమే నా లక్ష్యం అని  జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ పూషడపు రోహిణి తెలిపారు. జిల్లాలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతామన్నారు. బాపట్ల జిల్లాలోని గ్రామాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా చెరుకుపల్లి ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలో జిల్లా ప్రజా పరిషత్ కు తొలి మహిళ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టడం నాకెంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి, మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. 
       
    నాపై ఉంచిన బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని జిల్లా ప్రజా పరిషత్ వైస్ ఛైర్ పర్సన్ కలవకూరి పిచ్చమ్మ అన్నారు. ఈ పదవిలో ఉండడానికి సహకరించిన ప్రజలందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

       గ్రామాలలో అభివృద్ధి ఇకనుంచి పరుగులు పెడుతోందని బాపట్ల పార్లమెంట్ సభ్యులు, పానెల్ స్పీకర్, హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఇప్పటివరకు ఢిల్లీలో ప్రధానమంత్రిగా మోడీ, అమరావతిలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుతో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన సాగించిందన్నారు. జిల్లా ప్రజా పరిషత్ పరిపాలన వ్యవస్థ మూడో ఇంజిన్ గా రాష్ట్రానికి నిలిచిందన్నారు. కేంద్ర రాష్ట్ర నుంచి గ్రామాల అభివృద్ధికి నిధులు విరివిగా రానున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధికి జిల్లా పరిషత్ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రధానంగా విద్యా వ్యవస్థ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపన, యువత నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అప్పుడే అభివృద్ధి పట్టాల వైపు జిల్లా సాగుతుందన్నారు. యువత భవిష్యత్తు కొరకు పనిచేసే అవకాశం లభించిందన్నారు. బాపట్ల జిల్లాలో రూ.6వేల కోట్లతో రైల్వే పనులు, మరో రూ.ఐదు వేల కోట్లతో రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. 
      
      గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని శాసనమండలి సభ్యురాలు పోతుల సునీత తెలిపారు. సాగు తాగునీరు విద్య విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. మెరుగైన సేవలు ప్రజలకు అందినప్పుడే అభివృద్ధి వైపు జిల్లా పయనిస్తుందన్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడిన బాపట్ల జిల్లాలో సాగునీటి వ్యవస్థను సరిచేయాలన్నారు. 
         
       ప్రజలు మనకిచ్చిన బాధ్యతను గుర్తించి, ప్రజల సంక్షేమ కొరకు పని చేయాలని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ తెలిపారు. జిల్లా అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలన్నారు. అన్ని నియోజకవర్గాలలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు సమానంగా కేటాయించాలని సూచించారు. కూటమి సర్కారుకు ప్రజలు సహకరించడం సంతోషదాయకం అన్నారు. జిల్లాలోకి పెట్టుబడులు వస్తే సహకరించాలని, ప్రజల కొరకు సంక్షేమ పథకాల అమలు చేయాలన్నారు. 
       
      జిల్లా ప్రజా పరిషత్  ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ పదవులు కూటమికి దక్కడం సంతోషదాయకమని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. బాపట్ల జిల్లాలో జిల్లా ప్రజా పరిషత్ తొలి పాలకవర్గం ఏర్పాటు కావడంపై అభినందించారు. ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు.
          
         ఈ సమావేశంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, జిల్లా ప్రజా పరిషత్ సీఈవో విజయలక్ష్మి, బాపట్ల ఆర్డిఓ హరికుమార్, బుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, అధికారులు, జిల్లా ప్రజా పరిషత్ నూతన పాలకవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.