38వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టిడిపి అభ్యర్థి ఇస్కా విక్రమ్ రెడ్డి కి మహిళలు బ్రహ్మరథం..!
కావలి, మేజర్ న్యూస్ : కావలి మున్సిపాలిటీ పరిధిలోని 38వ వార్డులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి ఇస్క విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ, విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొనడం ప్రత్యేక విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి ఇస్కా విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, సమృద్ధిని ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. కావలి పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేక కృషి చేస్తున్నారని, ఆయన బాటలోనే 38వ వార్డును అన్ని విధాలా ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ, రానున్న ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మునగామురళిఅభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు మహిళలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.