మహిళా డిగ్రీ కళాశాలలో ముగిసిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
గజ్వేల్ ; మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనితా అబ్రహాం ఆధ్వర్యం లో 59 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నవంబర్ 14 నుంచి 20వ తారీకు వరకు జరిగిన ఈ వారోత్సవాలలో భాగంగా కళాశాలలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. విద్యార్ధులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలు బుక్ రివ్యూ పోటీ నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు వైస్ ప్రిన్సిపల్ కమలా క్రిస్టియానా బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నీ పోటీలలో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. మురళీధర్, డా. సౌజన్య, డా. సుజాత, డా. బాల చంద్రం, డా. శ్రీలత, అర్చన, ఉమా రాణి బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.