BREAKING
ఇందిరమ్మ బీమా పథకంతో ప్రతి కుటుంబానికి భరోసా పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మాపూర్ గ్రామం ఎంపిక సర్పంచ్ కు 71, వార్డుకు 366 నామినేషన్లు “3వ వార్డులో ప్రచార జోరు.. రూపేష్ గుప్తాకు నేతల మద్దతు ఘనంగా ప్రారంభమైన 'అంతార్ డెజర్ట్స్' యూరోపియన్ బ్యాంకింగ్ రంగంలో ఆర్సెల్ సంచలన విజయం శివాలయం ఉప ప్రధానార్చకులు జాలయ్య ఆకస్మిక మృతి సిద్దిపేట సభ అనంతరం ప్రమాదంలో మృతి చెందిన కొమ్ము సారవ్వ కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శ.. గుండ్లకొండ సర్పంచ్ గా లక్ష్మి ఏకగ్రీవం పామూరు జడ్పీటీసీగా జాహ్నవి బాధ్యతలు స్వీకారం పండుగ సీజన్ అంచనాలపై నీలినీడలు.. రాస్ స్టోర్స్ షేర్లు కుదేలు సర్పంచ్ బోయిని సంపత్ తండ్రి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన కోహెడ మండల బిఆర్ఎస్ నాయకులు. కెనడా రిటైల్ అమ్మకాలు సెప్టెంబర్‌లో 0.8 శాతం వృద్ధి నీటిని వృదాచేస్తే ఇబ్బందులు తప్పవు

అలింకో ఆధ్వర్యంలో వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి - మంత్రి పొన్నం ప్రభాకర్.

Select Suryaa Now
అలింకో ఆధ్వర్యంలో వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి - మంత్రి పొన్నం ప్రభాకర్.

కోహెడ ;  నియోజకవర్గంలో ఉపకరణాలు లేని దివ్యాంగులు ఉండకూడదు. అర్హులైన ప్రతి ఒక్కరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నెల రోజుల తర్వాత ప్రత్యేక కంటి పరీక్షల శిబిరం నిర్వహిస్తాం. హుస్నాబాద్ నియోజకవర్గంలోని వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అన్నారు. కొహెడ మండల కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో అలింకో సంస్థ సహకారంతో వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలు అందించేందుకు ఏర్పాటు చేసిన నిర్ధారణ శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శారద, మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్, ఆర్డీవో రామ్మూర్తి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని వృద్ధులు, దివ్యాంగులకు వారి అవసరాలకు అనుగుణంగా సహాయ ఉపకరణాలను అందించేందుకు ఈ నిర్ధారణ శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాళ్లు లేని వారికి కృత్రిమ కాళ్లు, చేతులు లేని వారికి కృత్రిమ చేతులు, చెవిటి వారికి వినికిడి పరికరాలు, ఇతర అవసరమైన సహాయ ఉపకరణాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో సహాయ ఉపకరణాలు అవసరమైన దివ్యాంగులు ఎవరూ వాటికి దూరంగా ఉండకూడదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ శిబిరాల్లో పాల్గొని తమ అవసరాలను నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. నెల రోజుల తర్వాత ప్రత్యేక కంటి పరీక్షల శిబిరాన్ని కూడా నిర్వహించి అవసరమైన వారికి కంటి సంబంధిత సహాయం అందిస్తామని తెలిపారు. ఇప్పటికే హుస్నాబాద్ నియోజకవర్గంలో 5 వేలకుపైగా నూతన చేయూత పింఛన్లు మంజూరు చేసి అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అన్ని గ్రామాల్లో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు ఈ నిర్ధారణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని తమకు అవసరమైన సహాయ ఉపకరణాలను పొందాలని మంత్రి కోరారు.