BREAKING
ఇందిరమ్మ బీమా పథకంతో ప్రతి కుటుంబానికి భరోసా పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మాపూర్ గ్రామం ఎంపిక సర్పంచ్ కు 71, వార్డుకు 366 నామినేషన్లు “3వ వార్డులో ప్రచార జోరు.. రూపేష్ గుప్తాకు నేతల మద్దతు ఘనంగా ప్రారంభమైన 'అంతార్ డెజర్ట్స్' యూరోపియన్ బ్యాంకింగ్ రంగంలో ఆర్సెల్ సంచలన విజయం శివాలయం ఉప ప్రధానార్చకులు జాలయ్య ఆకస్మిక మృతి సిద్దిపేట సభ అనంతరం ప్రమాదంలో మృతి చెందిన కొమ్ము సారవ్వ కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శ.. గుండ్లకొండ సర్పంచ్ గా లక్ష్మి ఏకగ్రీవం పామూరు జడ్పీటీసీగా జాహ్నవి బాధ్యతలు స్వీకారం పండుగ సీజన్ అంచనాలపై నీలినీడలు.. రాస్ స్టోర్స్ షేర్లు కుదేలు సర్పంచ్ బోయిని సంపత్ తండ్రి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన కోహెడ మండల బిఆర్ఎస్ నాయకులు. కెనడా రిటైల్ అమ్మకాలు సెప్టెంబర్‌లో 0.8 శాతం వృద్ధి నీటిని వృదాచేస్తే ఇబ్బందులు తప్పవు

బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని అరికట్టాలి

Select Suryaa Now
బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని అరికట్టాలి

సిద్దిపేట రూరల్,  : బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించాలని ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ గణేష్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చింతమడక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్, డిసిపిఓ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాల కార్మికత్వం వల్ల చిన్నారుల భవిష్యత్తుపై పడే ప్రభావాలను వివరించారు. బాలలతో పనులు చేయించకుండా బడికి పంపించాలని, ప్రతి చిన్నారికి విద్య అందేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరానికి మించి ఫోన్ వినియోగించడం వల్ల చదువుపై ఏకాగ్రత తగ్గడంతో పాటు ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వివరించారు. సామాజిక మాధ్యమాల్లో అపరిచితులతో పరిచయాలు, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.బాల్యాన్ని పనుల్లో కాకుండా చదువులో గడిపేలా చూడాలని, బాలల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని గణేష్ పేర్కొన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మికత్వం కనిపిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. బాలల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రమేష్, వీణ మౌనిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.