ఎంవీఎస్ కళాశాలకు పరిశోధనా కేంద్రం మంజూరు
మహబూబ్ నగర్ మేజర్ న్యూస్ -
ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పాలమూరు విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రాన్ని మంజూరు చేసింది. ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల అర్హతలు, కళాశాలలోని ప్రయోగశాలల్లో అందుబాటులో ఉన్న పరిశోధనా మౌలిక వసతులను పరిశీలించిన పాలమూరు విశ్వవిద్యాలయ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.
దీంతో కళాశాలకు వృక్షశాస్త్రం, రసాయనశాస్త్రం, గణితం, వాణిజ్యశాస్త్రం, ఆంగ్లం, అర్థశాస్త్రం మరియు తెలుగు సబ్జెక్టులలో పరిశోధనా కేంద్రాలను మంజూరు చేసింది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మావతి మరియు వివిధ విభాగాల అధిపతులు విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ జీ ఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రమేష్ బాబు మరియు అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రకిరణ్ లను శుక్రవారం కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ,కళాశాలలో పరిశోధనలకు అవసరమైన అన్ని మౌలికవసతులను ఇంకా మెరుగుపరచుకొని పరిశోధనా రంగం లో ఒక మంచి స్థానాన్ని పొందే విధంగా కృషిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డా.సురేష్, డా. మంజుల, డా. సాంబశివరావు, డా.నిరంజన్ గౌడ్, డా. హరిప్రసాద్, డా.రాజేందర్, డా.సూర్యనారాయణ, డా. మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
ఎం.ఓం ప్రకాష్ మహబూబ్ నగర్