BREAKING
ఇందిరమ్మ బీమా పథకంతో ప్రతి కుటుంబానికి భరోసా పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మాపూర్ గ్రామం ఎంపిక సర్పంచ్ కు 71, వార్డుకు 366 నామినేషన్లు “3వ వార్డులో ప్రచార జోరు.. రూపేష్ గుప్తాకు నేతల మద్దతు ఘనంగా ప్రారంభమైన 'అంతార్ డెజర్ట్స్' యూరోపియన్ బ్యాంకింగ్ రంగంలో ఆర్సెల్ సంచలన విజయం శివాలయం ఉప ప్రధానార్చకులు జాలయ్య ఆకస్మిక మృతి సిద్దిపేట సభ అనంతరం ప్రమాదంలో మృతి చెందిన కొమ్ము సారవ్వ కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శ.. గుండ్లకొండ సర్పంచ్ గా లక్ష్మి ఏకగ్రీవం పామూరు జడ్పీటీసీగా జాహ్నవి బాధ్యతలు స్వీకారం పండుగ సీజన్ అంచనాలపై నీలినీడలు.. రాస్ స్టోర్స్ షేర్లు కుదేలు సర్పంచ్ బోయిని సంపత్ తండ్రి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన కోహెడ మండల బిఆర్ఎస్ నాయకులు. కెనడా రిటైల్ అమ్మకాలు సెప్టెంబర్‌లో 0.8 శాతం వృద్ధి నీటిని వృదాచేస్తే ఇబ్బందులు తప్పవు

ఎన్నికల విధుల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలు :జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి

Select Suryaa Now
ఎన్నికల విధుల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలు  :జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి

బాపట్ల, మేజర్‌న్యూస్‌:

  2 వ సాధారణ స్థానిక సంస్థల బాపట్ల మున్సిపాలిటీ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు మరియు సిబ్బంది కి  పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకు నేందుకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి., శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల  26 న బాపట్ల మున్సిపాలిటీ కి ఎన్నికల జరగనున్న సందర్భంగా  బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికలలో ఎలక్షన్ విధులు నిర్వహించేసి సిబ్బందికి ఈ నెల 23, 24 తేదీలలో  మున్సిపల్ కార్యాలయంలోని అడ్మినిస్ట్రేషన్ సెక్షన్‌లో కేంద్రం పోస్టల్ బ్యాలెట్ వినోయోగించుకొనేందుకు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.  గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ (పర్చూరు నియోజకవర్గం) సిబ్బందికి నవంబర్ 23, 24 తేదీల్లో, రెండో దశ (చీరాల, వేమూరు నియోజకవర్గాలు) సిబ్బందికి నవంబర్ 26, 27 తేదీల్లో, మూడో దశ (బాపట్ల, రేపల్లె నియోజకవర్గాలు) సిబ్బందికి నవంబర్ 29, 30 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలుపనిచేస్తాయని,పంచాయతీ ఎన్నికల విధులలో పాల్గొనే అధికారులు మరియు సిబ్బంది  సంబంధిత మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది ఎన్నికల విధుల ఉత్తర్వు, గుర్తింపు కార్డును చూపించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. అదనపు సమాచారం కోసం పట్టణ ప్రాంతాల్లో సంబంధిత మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని, గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.