ఎన్నికల అధికారులకు శిక్షణ
కొడవలూరు, మేజర్ న్యూస్ : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సోమ్లా నాయక్ మాట్లాడుతూ ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని కోరినారు ఎంపీడీవో వెంకటసుబ్బారావు మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ నిబంధనలను అనుసరించి గట్టి చర్యలు తీసుకున్నామని కాబట్టి ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించాలని ప్రతి ఒక్కరినికోరినారు ఈ శిక్షణ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో శ్యాంసుందర్ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.