BREAKING
రూ.1.15 కోట్ల విలువైన అక్రమ సిగరెట్లు స్వాధీనం .. విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ రామాయపట్నం పోర్టుకు కస్టమ్స్ హోదా.. మా విజన్ సాకారమవుతోంది: వైఎస్ జగన్ పాలమాకుల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇనుప ఖనిజం, బొగ్గు, విద్యుత్ జోరు మహిళా డిగ్రీ కళాశాలలో ముగిసిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అలింకో ఆధ్వర్యంలో వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి - మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట అభివృద్ధికి.. తెలంగాణ ఉద్యమానికి మదన్ మోహన్ సేవలు చిరస్మరణీయం! శతవసంతాల శిఖరం చుక్కా రామయ్యకు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నికల విధుల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలు :జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి బాడంగి గ్రంథాలయంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు ఎంవీఎస్ కళాశాలకు పరిశోధనా కేంద్రం మంజూరు బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని అరికట్టాలి ఎంపీపీ జయచంద్ర నాయుడికి ఘన సన్మానం అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని అరికట్టాలి

మోసపోయాం జానకి టైటిల్ ఆసక్తికరంగా ఉందన్న సందీప్ రెడ్డి వంగా.. చిత్రబృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు!

Select Suryaa Now
మోసపోయాం జానకి టైటిల్ ఆసక్తికరంగా ఉందన్న సందీప్ రెడ్డి వంగా.. చిత్రబృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో విభిన్నమైన టైటిళ్లతో రూపొందే సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. తాజాగా సాయి సోహన్, విస్మయ శ్రీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం మోసపోయాం జానకి. ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండగా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి నెలకొంది.

మోసపోయాం జానకి టైటిల్ ఎంతో ఆసక్తికరంగా ఉందని పేర్కొన్న సందీప్ రెడ్డి వంగా, చిత్రబృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. స్టార్ దర్శకుడి నుంచి ప్రశంసలు అందడంతో సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. క్రైమ్ కామెడీ జానర్‌లో ఆద్యంతం వినోదాత్మకంగా సాగే కథాంశంతో దర్శకుడు మధుసూధన్ రెడ్డి గోపు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, సెవెన్ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా తమ ప్రొడక్షన్ నెంబర్ 3గా అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో విష్ణు ఓయ్, నరేంద్ర రవి, హరితేజ, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నటీనటుల బృందం, ఆకట్టుకునే టైటిల్‌తో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన మోసపోయాం జానకి ప్రస్తుతం నిర్మాణ పనులను వేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.