బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని అరికట్టాలి
బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని అరికట్టాలి
-స్మార్ట్ ఫోన్ వినియోగంపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి
-బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
-ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ గణేష్
సిద్దిపేట రూరల్ :బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించాలని ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ గణేష్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చింతమడక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్, డిసిపిఓ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాల కార్మికత్వం వల్ల చిన్నారుల భవిష్యత్తుపై పడే ప్రభావాలను వివరించారు. బాలలతో పనులు చేయించకుండా బడికి పంపించాలని, ప్రతి చిన్నారికి విద్య అందేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరానికి మించి ఫోన్ వినియోగించడం వల్ల చదువుపై ఏకాగ్రత తగ్గడంతో పాటు ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వివరించారు. సామాజిక మాధ్యమాల్లో అపరిచితులతో పరిచయాలు, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.బాల్యాన్ని పనుల్లో కాకుండా చదువులో గడిపేలా చూడాలని, బాలల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని గణేష్ పేర్కొన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మికత్వం కనిపిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. బాలల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రమేష్, వీణ మౌనిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.