మండల అభివృద్ధే లక్ష్యం ప్రజల నమ్మకమే బాధ్యత
- పామూరు ఎంపీపీగా పువ్వాడి వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం
- ఎంపీటీసీల మద్దతుతో ఏకగ్రీవ ఎన్నిక
- ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రకు,ఎంపీటీసీలకు కృతజ్ఞతలు
- మండల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తా
పామూరు, మేజర్ న్యూస్ : మండల పరిషత్ అధ్యక్షుడిగా పువ్వాడి వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఎంపీపీ ఎన్నికలో భాగంగా నిర్వహించిన ప్రక్రియలో మండల పరిధిలోని ఎంపీటీసీలంతా ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతూ చేతులెత్తి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పువ్వాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల పరిషత్ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన ఎన్నికకు సంపూర్ణ మద్దతు తెలిపిన ఎంపీటీసీలకు, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చిన మండల పరిధిలోని గ్రామ ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ఆయన సతీమణి తూర్పు కోడిగుడ్లపాడు ఎంపీటీసీ పువ్వాడి వెంకట లక్ష్మమ్మ కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మండల పరిధిలోని అన్ని గ్రామాల అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. పదవిని బాధ్యతగా భావించి ప్రజలకు అందుబాటులో ఉంటూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు పువ్వాడి వెంకటేశ్వర్లుకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో బ్రహ్మయ్య, గాలి వెంకటేశ్వర్లు, ఏలూరి వెంకటేశ్వర్లు,పువ్వాడి వెంకటేశ్వర్లు బిల్డర్, ఆకుపాటి వెంకటేష్, పువ్వాడి రామారావు, పువ్వాడి రామకృష్ణ, పువ్వాడి తిరుపతమ్మ, దారపనేని చంద్రశేఖర్, కల్లూరి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.