ఉండి ఎంపీపీగా ఇర్రింకి లావణ్య ప్రమాణస్వీకారం --ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు
ఉండి, మేజర్ న్యూస్:ఉండి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా ఇర్రింకి లావణ్య సత్యనారాయణ ప్రమాణ స్వీకారం గురువారం నిర్వహించారు. ఉండి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఆయన సమక్షంలో ఇర్రింకి లావణ్య అధ్యక్షురాలిగా పదవీ ప్రమాణం చేయగా ఉపాధ్యక్షుడిగా అడపా గణేష్, ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎంపీపీ లావణ్య అధికారికంగా బాధ్యతలు స్వీకరించి విధుల నిర్వహణ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇర్రింకి లావణ్య మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత అధికారుల సహకారంతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయడంతో పాటు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థుల సమన్వయంతో ఉండి మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని ఇర్రింకి లావణ్య వెల్లడించారు.ఈ కార్యక్రమంలో చెరుకువాడ గ్రామ అధ్యక్షుడు. ఉంగరాల నాగేశ్వరరావు
జుత్తుగా శ్రీనివాస్. పడమటి ఆంజనేయులు కోట వెంకటేశ్వరరావు కూటమి నాయకులు ఎంపీటీసీలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.