BREAKING
సత్య ప్రభ సేవలు చిరస్మరణీయం విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో విశేష కృషి – ఏడవ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు శరవేగంగా కొనసాగుతున్న బూరుగుపల్లి బస్టాండ్ పనులు కూతురి పేరు ప్రకటించిన ప్రేమలు ఫేమ్ సంగీత్ ప్రతాప్.. సోషల్ మీడియాలో క్యూట్ ఫొటోలు వైరల్! తాండూరు నియోజకవర్గ బీసీ యువజన సంఘం అధ్యక్షుడిగా రాము గౌడ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఏఐసీసీ, టిపిసిసి కి ఫిర్యాదు చేస్తా హై సినిమా నుంచి సూపర్ 5 సాంగ్ రిలీజ్.. నవంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ విడుదల! *చిలుకూరు వేణుగోపాల స్వామి, మల్లేశ్వర స్వామి భూములు దేవాదాయ శాఖ పరిధిలోకి* మధిర, సూర్య మేజర్ న్యూస్ : మండల అభివృద్ధే లక్ష్యం ప్రజల నమ్మకమే బాధ్యత తిరుపతి లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు చెత్తతో నిండిన రహదారి దుర్వాసనతో ఇబ్బందిపడుతున్న ప్రజలు అట్లూరు మండల పరిషత్ లో ఉత్కంఠ.. రేపు వైస్ ఎంపీపీ ఎన్నిక ఉండి ఎంపీపీగా ఇర్రింకి లావణ్య ప్రమాణస్వీకారం --ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఇంటి వద్దకే సమగ్ర వైద్యం.. హనుమకొండలో ఘనంగా మెడివాకర్స్ డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం! ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి భోగాపురం ఎంపీపీ పీఠం ఎవరిది?

భోగాపురం ఎంపీపీ పీఠం ఎవరిది?

Select Suryaa Now
భోగాపురం ఎంపీపీ పీఠం ఎవరిది?

* స్వతంత్రుల మద్దతు ఎవరికో.. 

* నేటి ఎన్నికపై సర్వత్రా ఆసక్తి

భోగాపురం, మేజర్ న్యూస్: భోగాపురం మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పీఠం ఎవరిని వరించనుందన్న అంశం రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. గురువారం ఎంపీపీ ఎన్నికకు రంగం సిద్ధమైనప్పటికీ, కీలకమైన ఎంపీటీసీ సభ్యుల గైర్హాజరుతో ఎన్నిక ప్రక్రియ మరుసటి రోజుకు వాయిదా పడింది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ఎంపీపీ ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా, వైసీపీ నుంచి గెలుపొందిన ఆరుగురు సభ్యులు మాత్రమే ఎన్నిక ప్రక్రియలో పాల్గొనేందుకు అందుబాటులో ఉన్నారు( సమావేశ మందిరంలో కాదు). జనసేనకు చెందిన ముగ్గురు, టీడీపీకి చెందిన ముగ్గురు, నలుగురు స్వతంత్ర సభ్యులు నిర్ణీత సమయానికి రాకపోవడంతో ఎన్నిక నిర్వహణ సాధ్యపడలేదు. దీంతో ఎన్నికను శుక్రవారం కు(నేటికి) వాయిదా వేసినట్లు ప్రొసీడింగ్ అధికారి ఎం. రామారావు ప్రకటించారు.

* స్వతంత్రులే కీలకం..

మండలంలోని మొత్తం 16 ఎంపీటీసీ స్థానాల ఫలితాలను పరిశీలిస్తే వైసీపీ ఆరు స్థానాలు, టీడీపీ మూడు, జనసేన మూడు, స్వతంత్ర అభ్యర్థులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. ఈ సంఖ్యాబలం ప్రకారం ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లేకపోవడంతో ఎంపీపీ పీఠం దక్కించుకోవాలంటే స్వతంత్ర సభ్యుల మద్దతు అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా వైసీపీకి ఆరుగురు సభ్యుల బలం ఉండగా, మరో నాలుగు స్వతంత్రుల మద్దతు ఎటువైపు ఉంటుందన్నది రాజకీయ సమీకరణాలను నిర్ణయించనుంది.

* జనసేనకు అధిష్టానం మద్దతు.. టీడీపీతో సమన్వయం?

కూటమి రాజకీయాల్లో భాగంగా భోగాపురం ఎంపీపీ పీఠాన్ని జనసేనకు కేటాయిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేనకు కేవలం మూడు స్థానాలే దక్కడం, టీడీపీకి కూడా మూడు స్థానాలే రావడంతో ఇరు పార్టీల మధ్య పరస్పర మద్దతు, సమన్వయం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో జనసేన అభ్యర్థికి టీడీపీ సభ్యుల మద్దతు లభిస్తుందా? మరోవైపు నలుగురు స్వతంత్ర సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

* స్వతంత్రులతో మంతనాలు.. రైతుల అంశం ప్రస్తావన!

స్వతంత్ర సభ్యుల మద్దతు కూడగట్టేందుకు కూటమి నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. భోగాపురం-1, భోగాపురం-2 స్థానాల నుంచి గెలుపొందిన స్వతంత్ర సభ్యులతో చర్చలు జరిపేందుకు పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే లోకం నాగమాధవితో పాటు పలువురు నాయకులు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా స్వతంత్ర సభ్యులు తమ రాజకీయ వైఖరిని స్పష్టం చేస్తూ, భోగాపురం ప్రాంత రైతుల సమస్యలు, భూముల అంశాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా స్వతంత్రులుగా బరిలోకి దిగామని, ఇప్పటివరకు రైతుల సమస్యలపై స్పష్టమైన మద్దతు ప్రకటించని నాయకులు ఇప్పుడు తమ మద్దతు కోరడం ఏమిటని వారు ప్రశ్నించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర సభ్యులను ఒప్పించి జనసేన అభ్యర్థికి మద్దతు కూడగట్టేందుకు కొందరు నాయకులు మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు సమాచారం.

* రేపటి నిర్ణయంపైనే అందరి దృష్టి..

ఒకవైపు అధిష్టానం నిర్ణయం, మరోవైపు స్థానిక రాజకీయ సమీకరణాలు, ఇంకోవైపు రైతుల సమస్యలపై స్వతంత్రుల వైఖరి.. ఇలా భోగాపురం ఎంపీపీ ఎన్నిక అనేక మలుపులు తిరుగుతోంది. జనసేనకు మద్దతు ప్రకటిస్తారా? టీడీపీ వైపు మొగ్గు చూపుతారా? లేక స్వతంత్రంగా తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారా? అన్నది ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. చివరి నిమిషం వరకు సాగుతున్న ఈ రాజకీయ మంతనాలకు రేపటి ఎంపీపీ ఎన్నికతో తెరపడనుంది. స్వతంత్రుల నిర్ణయం భోగాపురం మండల పరిషత్ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 రిపోర్టర్: వై శ్రీనివాస్, భోగాపురం.