తాండూరు నియోజకవర్గ బీసీ యువజన సంఘం అధ్యక్షుడిగా రాము గౌడ్
బషీరాబాద్,మేజర్ న్యూస్: తాండూరు నియోజకవర్గ బీసీ యువజన సంఘం అధ్యక్షుడిగా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామానికి చెందిన రాము గౌడ్ నియమితులయ్యారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈడిగ శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా రాము గౌడ్‌కు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా రాము గౌడ్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు ఈడిగ శ్రీనివాస్ గౌడ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీల హక్కుల సాధన, అభివృద్ధి, రాజకీయ చైతన్యం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. బీసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక తదితర అన్ని రంగాల్లో రాణించేలా తనవంతు కృషి చేస్తానని, తాండూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కమిటీలను ఏర్పాటు చేసి బీసీ యువజన సంఘాన్ని బలోపేతం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాంకుర్మ, బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొన్నారు.