BREAKING
ఇమ్రాన్ ఖాన్ విడుదల కోరుతూ శ్రీలంక పార్లమెంట్‌లో తీర్మానంపై చర్చకు సిద్ధం శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు త్వరగా పూర్తి చేయాలి : నగర కమిషనర్ కందనెల్లి చెక్‌డ్యామ్ వద్ద పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 8 మంది అరెస్ట్ చీపురుపల్లిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ ఆస్పత్రి వద్ద పుర్రె ఎముకలు లభించడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు చెర్లోపల్లి ఎంపీటీసీ గొల్ల వీరేష్ కు ఘనంగా శుభాకాంక్షలు *కుందుర్పి ఎంపీపీగా మంజులరఘువేంద్రబాబు* విత్తనోత్పత్తితో రైతన్నకు అదనపు ఆదాయం సత్య ప్రభ సేవలు చిరస్మరణీయం విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో విశేష కృషి – ఏడవ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు శరవేగంగా కొనసాగుతున్న బూరుగుపల్లి బస్టాండ్ పనులు కూతురి పేరు ప్రకటించిన ప్రేమలు ఫేమ్ సంగీత్ ప్రతాప్.. సోషల్ మీడియాలో క్యూట్ ఫొటోలు వైరల్! తాండూరు నియోజకవర్గ బీసీ యువజన సంఘం అధ్యక్షుడిగా రాము గౌడ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఏఐసీసీ, టిపిసిసి కి ఫిర్యాదు చేస్తా హై సినిమా నుంచి సూపర్ 5 సాంగ్ రిలీజ్.. నవంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ విడుదల! *చిలుకూరు వేణుగోపాల స్వామి, మల్లేశ్వర స్వామి భూములు దేవాదాయ శాఖ పరిధిలోకి* మధిర, సూర్య మేజర్ న్యూస్ :

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఏఐసీసీ, టిపిసిసి కి ఫిర్యాదు చేస్తా

Select Suryaa Now
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఏఐసీసీ, టిపిసిసి కి ఫిర్యాదు చేస్తా

 

సొంత పార్టీపై విమర్శలు సమంజసం కాదు : డీసీసీ అధ్యక్షుడు  పున్న కైలాష్ నేత

నల్లగొండ టౌన్, మేజర్ న్యూస్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీపై, ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. గురువారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సగటు సామాన్య, నిఖార్సయిన కార్యకర్తలకు ఆయన మాటలు బాధ కలిగిస్తున్నాయన్నారు. సొంత పార్టీపై, సొంత ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు ఆయుధాలు అందించి పార్టీని భూస్థాపితం చేస్తారా అని నిలదీశారు.
మీకు మంత్రి పదవి హామీ ఇచ్చింది ఎవరో వారి వద్ద పంచాయతీ పెట్టండి. బహిరంగ వేదికలపై మాట్లాడి మీ విలువ మీరు తగ్గించుకుంటున్నారని, పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడాలని సూచించారు. నా ప్రెస్ మీట్ పై ఎవరి ఒత్తిడి లేదని, పార్టీకి, ప్రభుత్వానికి తాను వారధినని, పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ కూర్చోనని స్పష్టం చేశారు.
మీకు కాంట్రాక్టులు దక్కలేదని, మంత్రి పదవి రాలేదని అనునిత్యం పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించడం వెనుక మీ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమన్నారు. కోటి 20 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం, 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ క్యాంటీన్ లో వడ్డీ లేని రుణాలు, 2 లక్షల రూపాయల రుణమాఫీ, 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం, రోడ్ల విస్తరణ, 20 లక్షల నూతన రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ - ఇవన్నీ మీకు కనపడటం లేదా అని నిలదీశారు. నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారన్నారు.
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి అంటూ మీ మంత్రి పదవి గోడు చెప్పుకున్నారు తప్ప, చిత్తశుద్ధిని ఎప్పుడూ చాటలేదన్నారు. నల్గొండ డీసీసీ గురించి పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. తాను డీసీసీ పదవి చేపట్టి నవంబర్ 22 నాటికి సంవత్సరం కావస్తున్నా, ఏనాడైనా తనను నియోజకవర్గానికి పిలిపించారా అని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం కోసం కృషి చేశారా అని అడిగారు.
మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, పార్టీ పదవులు అన్నీ బీజేపీ నుంచి వచ్చిన వారికి ఇచ్చారని, మరి కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. 2014లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి నేటి వరకు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు, ఆందోళనలు, రాస్తారోకోలు, సభలు నిర్వహించారా అని నిలదీశారు. వ్యక్తిగత కార్యక్రమాలు తప్ప పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలు చేయలేదన్నారు.
మీరు వచ్చాక కాంగ్రెస్ గెలిచిందని అంటున్నారు. అలాంటప్పుడు బీజేపీలో ఎందుకు కొనసాగలేదు? పార్టీ గెలుస్తుందని తెలిశాక కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని విమర్శించారు.
ఏఐసీసీ, టీపీసీసీకి ఫిర్యాదు చేస్తున్నానని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జిల్లాపల్లి పరమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, వేముల గోపీనాథ్, ఇందనూరి శ్రీను, ఆకటి సైదులు, ఎండి అజీజ్, చింతపల్లి బాలకృష్ణ, చింత వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.