*కుందుర్పి ఎంపీపీగా మంజులరఘువేంద్రబాబు*
**వైస్ ఎంపీపీగా సజ్జల వెంకటేష్*
*కుందుర్పి*
కుందుర్పి మండలపరిషత్ అధ్యక్షులుగా మంజుల రఘువేంద్రబాబు, ఉపాధ్యక్షులుగా సజ్జల వెంకటేశులను గురువారం ఎన్నికచేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగలింగేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో లక్ష్మిశంకర్లు తెలిపారు.స్థానిక జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో భాగంగా మండలంలో 15 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి ప్రభుత్వం 13ఎంపీటీసీ స్థానాలు, వైసీపీ రెండు దాని మిత్రపక్షం సీపీఐ ఒక ఎంపీటీసీ గెలుపొందిన విషయం తెలిసింది. గురువారం జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో మండలపరిషత్తు అధ్యక్షులుగా బెస్తరపల్లి ఎంపీటీసీ మంజుల రఘువేంద్రబాబు,మండల ఉపాధ్యక్షులుగా కుందుర్పి ఎంపీటీసీ-1స్థానం నుండి గెలుపొందిన సజ్జల వెంకటేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలచే ప్రమాణ స్వీకారం చేయించిన రిటర్నింగ్ అధికారి, కొత్తగా ఎన్నికైన మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులచేత ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో కుందుర్పి మండల ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని తెలిపారు అనంతరం మండలపరిషత్ పాలకవర్గానికి బాధ్యతలు అప్పచెప్పారు.ఈకార్యక్రమంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులతోపాటు ఎంపీటీసీలు బాగేపల్లి రామాంజనేయులు, నాగరాజు,వినోదమ్మ, ధనుంజయ,జ్యోతి,బాబు, అంజనమ్మ,సుజాతమ్మ, నాగమణి, ఓబులక్క, సిద్దేశ్వరి,సుమియాభాను,రూప, డిప్యూటీ ఎంపీడీవో నరసయ్య, సింగల్ విండో సొసైటీ అధ్యక్షులు చిత్రలింగ, పంచాయతీ కార్యదర్శ యల్లక్క, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది,స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
*. టి రాజు నేటిదినపత్రిక విలేఖరి కుందుర్పి**