BREAKING
వత్సవాయి మండలంలో రెండో రోజు నామినేషన్ల జోరు.. సర్పంచ్‌కు 62, వార్డులకు 240 నామినేషన్లు! ఆలయ నిర్మాణానికి రూ.25 వేల విరాళం అందించిన ప్రజా సేవకుడు మామిడి పూతదశ జాగ్రత్తల పై రైతులకు శిక్షణ చిత్తూరు రూరల్‌లో నూతన పాలన.. అధ్యక్షుడిగా జయచంద్ర నాయుడు, ఉపాధ్యక్షురాలిగా లావణ్య ఐఐటీ ఢిల్లీ అబుదాబి క్యాంపస్ తొలి బ్యాచ్ పట్టభద్రం ఎంపీపీ తుపాకుల చిన్న శేషయ్య, ఉపాధ్యక్షురాలు చింతల సోనియాకు టీడీపీ ఆధ్వర్యంలో ఘన సన్మానం గజమాలలు, పూలమాలలు, శాలువాలతో సత్కారం. జల సంచయ్ జన భాగీదారి పురోగతిపై సమీక్ష ప్రమాణ స్వీకారం చేసిన సెట్టూరు ఎంపీపీ, వైస్ ఎంపీపీల, ఎంపీటీసీలు. నేటి చిన్ని ఆలోచనలే రేపటి ఆవిష్కరణలకు పునాది : అన్నమయ్య జిల్లా డీఈవో సుబ్రహ్మణ్యం : బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ విజేతలకు అభినందనలు అద్దంకి ఆర్డీఓ కేంద్రంలో 53 నామినేషన్లు.. సర్పంచ్ పదవికి 30, వార్డులకు 23 దాఖలు. ఇమ్రాన్ ఖాన్ విడుదల కోరుతూ శ్రీలంక పార్లమెంట్‌లో తీర్మానంపై చర్చకు సిద్ధం శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు త్వరగా పూర్తి చేయాలి : నగర కమిషనర్ కందనెల్లి చెక్‌డ్యామ్ వద్ద పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 8 మంది అరెస్ట్ చీపురుపల్లిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ ఆస్పత్రి వద్ద పుర్రె ఎముకలు లభించడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు

ప్రమాణ స్వీకారం చేసిన సెట్టూరు ఎంపీపీ, వైస్ ఎంపీపీల, ఎంపీటీసీలు.

Select Suryaa Now
ప్రమాణ స్వీకారం చేసిన సెట్టూరు ఎంపీపీ, వైస్ ఎంపీపీల, ఎంపీటీసీలు.

ప్రమాణ స్వీకారం చేసిన శెట్టూరు మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు

నూతన ప్రజాప్రతినిధులకు అభినందనలు.. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు

శెట్టూరు మండలంలో నూతనంగా ఎన్నికైన మండల ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షురాలిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఖరారు చేసిన అభ్యర్థి రామలక్ష్మి, ఉపాధ్యక్షుడిగా మనోహర్‌తో పాటు నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రజాప్రతినిధులు మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా పనిచేస్తామని ఆకాంక్షించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
ప్రమాణ స్వీకారం అనంతరం ఎంపీపీ రామలక్ష్మి, వైస్ ఎంపీపీ మనోహర్‌తో పాటు ఎంపీటీసీ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు అవకాశం కల్పించడంలో సహకరించిన పార్టీ అధిష్టానానికి, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో సమష్టిగా పనిచేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటామని నూతన ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టడంతో శెట్టూరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతం లభిస్తుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశాయి.

 ఖాసిం,నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ సెట్టూరు.