మామిడి పూతదశ జాగ్రత్తల పై రైతులకు శిక్షణ
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి
మామిడి పంటపూత దశలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త ల గురించి రైతులకు వివరించినట్లు ఉద్యానశాఖ అధికారి వరప్రసాద్ తెలిపారు. మండలంలోని కమ్మ పాలెం రైతు సేవ కేంద్రంలో నిర్వహించిన శిక్షణ కేంద్రంలో మదనపల్లి ఉద్యాన కేంద్రం శాస్త్రవేత్త శాస్త్రవేత్త దత్తా రెడ్డి మామిడి పూత దశలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త లు గురించి వివరించారు. పూత నిలబడటానికి అర్కా మాంగో స్పెషల్ అనేది ఐ ఐ హెచ్ ఆర్ బెంగళూరు వారిచే కొత్తగా కనుగొనబడిన పోషకం ని ఒక లీటర్ నీటిలో 8గ్రాములు కలిపి పిచికారీ చేయాలని,పూత మొదలవటానికి డిసెంబర్ 2వ వారం 13.0.45(మల్టీ కే ) 8గ్రాములు మరియు బోరాన్ 2గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే తద్వారా పూత బాగా తయారవుతుందన్నారు. పురుగు మందులు పిచికారీ చేసినపుడు మొక్క యొక్క కాండం నుండి చిగురు వరకు తడిచేలా పిచికారీ చేయాలని, పురుగు మందులను వాడేటప్పుడు ఒకేరకం మందును మరల మరల వాడకుండా మార్చుకుంటూ పిచికారీ చేయవలన్నారు.పూత సమయం లో నీటి తడులు ఇవ్వకూడదని,పూత పూర్తిగ విచ్చుకున్న తరువాత క్రిమి సంహారక మందులు పిచికారి చేయకూడదన్నారు. దీని వల్ల పరాగసంపర్కం చేసే ఈగలు చనిపోతాయని దీనిని రైతులందరూ దృష్టిలో పెట్టుకోవాలన్నారు.
ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి రిపోర్టర్ పెద్దపంజాణి