BREAKING
వింజమూరు మండలం ఎంపీపీగా గణపం ప్రమాణ స్వీకారం అమెరికాలో స్వల్పంగా పెరిగిన వారపు నిరుద్యోగ క్లెయిమ్‌లు పేద విద్యార్థిని లండన్ చదువుకు ఆసరాగా నిలిచిన రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలు సద్వినియోగపరచుకుంటే అనంత జ్ఞానం స్మార్ట్ గ్లాసెస్ కొనుగోలు చేయవద్దు..డచ్ డేటా నియంత్రణ సంస్థ కీలక హెచ్చరిక నిబద్దత కలిగిన నేత శివయ్య..! -సర్వేపల్లి ఎమ్మెల్యే "సోమిరెడ్డి"..!! ఉప్ప‌ల‌పాటి 'రూబీ జూబ్లీ వేడుకల లోగో,పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్రిమియా వంతెన దాడి తర్వాత నల్ల సముద్రం, ఇంధన కాల్పుల విరమణకు పుతిన్ తిరస్కరణ రష్యా ఇంధన దిగుమతులపై ఐరోపాకు ఆసక్తి లేదు ఇటలీలో హ్యాకర్ల బెదిరింపులు.. అస్థిరపరిచే యత్నమే కానీ ముప్పు లేదన్న మంత్రి కొలువుదీరిన మండల పరిషత్ పాలకవర్గాలు : నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఏలూరి భారత్ జపాన్ రక్షణ బంధం మరింత పటిష్టం..ఇండో పసిఫిక్ భద్రతకు కొత్త ఊపు వత్సవాయి మండలంలో రెండో రోజు నామినేషన్ల జోరు.. సర్పంచ్‌కు 62, వార్డులకు 240 నామినేషన్లు! ఆలయ నిర్మాణానికి రూ.25 వేల విరాళం అందించిన ప్రజా సేవకుడు మామిడి పూతదశ జాగ్రత్తల పై రైతులకు శిక్షణ

వత్సవాయి మండలంలో రెండో రోజు నామినేషన్ల జోరు.. సర్పంచ్‌కు 62, వార్డులకు 240 నామినేషన్లు!

Select Suryaa Now
వత్సవాయి మండలంలో రెండో రోజు నామినేషన్ల జోరు.. సర్పంచ్‌కు 62, వార్డులకు 240 నామినేషన్లు!

ఎన్టీఆర్ జిల్లా, వత్సవాయి:

వత్సవాయి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో రోజు కూడా నామినేషన్ల పరంపర కొనసాగింది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.

రెండో రోజు నామినేషన్ల స్వీకరణ ముగిసే సమయానికి మండలవ్యాప్తంగా సర్పంచ్ పదవులకు 62 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 240 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 302 నామినేషన్లు నమోదయ్యాయి.

గ్రామాల వారీగా సర్పంచ్ నామినేషన్ల వివరాలు:

అల్లూరుపాడు – 3, భీమవరం – 4, చిన్నమోదుగుపల్లి – 2, దబ్బాకుపల్లి – 1, దేచుపాలెం – 3, గోపినేనిపాలెం – 3, కంభంపాడు – 3, కన్నెవీడు – 1, లింగాల – 2, మక్కపేట – 8, మంగొల్లు – 6, పెద్దమోదుగుపల్లి – 5, పెంట్యాలవారిగూడెం – 1, పోచవరం – 3, పోలంపల్లి – 7, రామచంద్రపురం – 1, సింగవరం – 2, తాళ్లూరు – 3, వత్సవాయి – 3, వేములనర్వ – 1.గ్రామాల వారీగా చూస్తే మక్కపేట నుంచి అత్యధికంగా 8 నామినేషన్లు దాఖలయ్యాయి. పోలంపల్లి నుంచి 7, మంగొల్లు నుంచి 6, పెద్దమోదుగుపల్లి నుంచి 5 నామినేషన్లు నమోదయ్యాయి.మరోవైపు వార్డు సభ్యుల స్థానాలకు కూడా 240 నామినేషన్లు దాఖలు కావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రానున్న రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారనుంది.

మొత్తం నామినేషన్లు:

  • సర్పంచ్ స్థానాలు: 62
  • వార్డు సభ్యుల స్థానాలు: 240
  • మొత్తం: 302