BREAKING
బ్రూక్‌డేల్ సీనియర్ లివింగ్‌లో 5 శాతం దాటిన కరోనేడ్ వాటా నూతన మునిసిపల్ చైర్మన్‌గా శ్రీరామ్ చినబాబు బాధ్యతలు : శుభాకాంక్షలు తెలిపిన పచ్చిపాల తులసి రామకృష్ణ దంపతులు కాప్31 వేదికగా వాతావరణ నిధుల చర్చలు..ఎల్ నినో ప్రభావంతో పెరిగిన తీవ్రత ఆత్మకూరు మండల అధ్యక్షురాలుగా దావా సుమన్య ఏకగ్రీవంగా ఎన్నిక పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు టిడిపి మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఎమ్మెల్యే కావ్య. . చరిత్ర సృష్టించిన ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఐపీఓ..నాస్‌డాక్‌లో రికార్డు స్థాయిలో షేర్ల విక్రయం నామినేషన్ ప్రక్రియకు ఆటంకం కలిగించే వారిపై కేసులు నమోదు చేసి, శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఉత్సాహంగా జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపిక పోటీలు రెండవ 224 నామినేషన్ల దాఖలు రైల్వే గేటు అండర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన కమిషనర్ ఆదిత్య కళాశాలలో ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు జయంతి 40వ వార్డు టీడీపీ అభ్యర్థిగా బట్టేపాటి అశోక్‌కు బీ-ఫారం అందజేత నరసాపురం- పూరీ మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటే అవకాశం

పేద విద్యార్థిని లండన్ చదువుకు ఆసరాగా నిలిచిన రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు

Select Suryaa Now
పేద విద్యార్థిని లండన్ చదువుకు ఆసరాగా నిలిచిన రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు

అమలాపురం, మేజర్‌న్యూష్ :

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఓ పేద ముస్లిం మైనార్టీ విద్యార్థిని ఉన్నత చదువు కోసం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ పెద్ద మనసు చాటుకున్నారు. లండన్‌లో ఎంబీఏ చదువుకోవాలన్న ఆ విద్యార్థిని కలకు తన ఆర్థిక సాయంతో అండగా నిలిచారు. ఎంపీ ఉదార స్వభావం పట్ల కోనసీమ ముస్లిం మైనార్టీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
వివరాల్లోకి వెళితే... అమలాపురానికి చెందిన మహమ్మద్ రెహనా అనే విద్యార్థిని లండన్‌లో ఎంబీఏ చదవాలని భావించింది. అయితే ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూసింది. ఇటీవల రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన సానా సతీష్ టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు ఆహ్వానం మేరకు కోనసీమ విచ్చేశారు. ఈ సందర్భంగా టీడీపీ బూత్ కన్వీనర్ వెంకటేశ్వరరావు ద్వారా రెహనా తన పరిస్థితిని వివరిస్తూ ఎంపీకి వినతిపత్రం అందజేసింది. విద్యార్థిని విజ్ఞప్తి పై ఎంపీ సానా సతీష్ తక్షణమే స్పందించారు. ఉన్నత చదువుల పట్ల ఆమెకున్న ఆసక్తిని గమనించి పూర్తి అండదండలు అందించారు. రెహనా ఎంబీఏ చదువుకు అయ్యే ఖర్చుతో పాటు, లండన్ వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ ఖర్చులన్నీ తానే భరించి ఆమెను విదేశాలకు పంపారు.సకాలంలో స్పందించి పేద విద్యార్థిని జీవితంలో వెలుగులు నింపిన ఎంపీ సానా సతీష్‌కు కోనసీమ ముస్లిం మైనార్టీ నాయకులు, పెద్దలు ఘనంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీకి కృతజ్ఞతలు తెలిపిన వారిలో స్టేట్ వక్ఫ్ బోర్డ్ సభ్యులు హాజీ ముఖరం హుస్సేన్, ప్రముఖ న్యాయవాది మహమ్మద్ అజమ్, ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అధ్యక్షులు మహమ్మద్ బషీర్, టీడీపీ ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ మిరాన్ షరీఫ్, జనసేన నాయకులు మహమ్మద్ మహబూబ్ షరీఫ్, ఖాదర్ వలీ తదితరులు ఉన్నారు.