BREAKING
బచ్చే హల్లి గ్రామపంచాయతీ ఎంపీటీసీ గా గొల్ల జ్యోతి ప్రమాణ స్వీకారం కొత్త ఫార్మ్ బిల్లును తక్షణమే ఆమోదించాలి..కాంగ్రెస్‌కు డొనాల్డ్ ట్రంప్ పిలుపు రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజబాబు నేడు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో లక్ష బిల్వార్చన మహోత్సవం ఆత్మకూరులో ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం పెరిగిన చమురు ధరల లాభాలు వాటాదారులకు..అమెరికా షేల్ కంపెనీల కీలక నిర్ణయం అద్దంకి సీహెచ్‌సీని తనిఖీ చేసిన ఆరోగ్య శాఖ కమిషనర్ ఎంపీపీ, వైస్ ఎంపీపీల ప్రమాణ స్వీకారం పెరుగు పాలెం ఎంపీటీసీగా జ్యోతి ప్రమాణ స్వీకారం యస్ బ్యాంక్ ఏటీ-1 బాండ్ల వివాదం..రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్బీఐకి లేఖ ఎంపీటీసీ సభ్యులను సన్మానించిన ఎంపీడీవో ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక అమెజాన్ అడవుల పరిరక్షణకు 100 మిలియన్ డాలర్లకు పైగా గ్రాంట్లు కావలి.. 12వ వార్డులో మునగా మురళి విస్తృత ప్రచారం. బ్రూక్‌డేల్ సీనియర్ లివింగ్‌లో 5 శాతం దాటిన కరోనేడ్ వాటా

నూతన మునిసిపల్ చైర్మన్‌గా శ్రీరామ్ చినబాబు బాధ్యతలు : శుభాకాంక్షలు తెలిపిన పచ్చిపాల తులసి రామకృష్ణ దంపతులు

Select Suryaa Now
నూతన మునిసిపల్ చైర్మన్‌గా శ్రీరామ్ చినబాబు బాధ్యతలు : శుభాకాంక్షలు తెలిపిన పచ్చిపాల తులసి రామకృష్ణ దంపతులు

మదనపల్లి టౌన్,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా,మదనపల్లి మున్సిపల్ నూతన చైర్మన్‌గా గురువారం శ్రీరామ్ చినబాబు బాధ్యతలు స్వీకరించారు.ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పచ్చిపాల తులసి,రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్,28వ వార్డు కౌన్సిలర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారిలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో మాస్,డైనమిక్ లీడరుగా శ్రీరామ్ చినబాబు గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన అనేక పోరాటాలు చేశారని గుర్తుచేశారు.తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన సమర్థవంతంగా పనిచేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ బాబుల వద్ద ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.కూటమి మదనపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగి అద్భుత విజయం సాధించారన్నారు.ఆయన సారధ్యంలో మదనపల్లి పట్టణం అన్నిరంగాల్లో ముందంజ వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఆయన సహకారంతో 28వ వార్డును మరింత అభివృద్ధి చేయడంతోపాటు ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి