BREAKING
యశోదలో తుంటి ఎముక విరుపులకు అత్యాధునిక చికిత్స -తుంటి ఎముక చికిత్సలో యశోద నయా టెక్నాలజీ -సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ బ్రిజేష్ కిడియూర్ ఎల్‌నినో ఎఫెక్ట్: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయండి నెల్లూరు రూరల్ మండల అధ్యక్షురాలిగా యాకసిరి లలిత ఈ నెల 22న అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ మహాసభ… వెయ్యి మంది ప్రతినిధులతో నిర్వహణకు ఏర్పాట్లు - స్వర్ణోత్సవాల కమిటీ చైర్మన్ మామిడిపల్లి బాపయ్య ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం వివరాలు ఏఎస్ పేట మండల అధ్యక్షురాలుగా అబ్బూరి శ్రీవాణి చంద్రగిరి ఎంపీపీగా సరితా రమణమూర్తి, వైస్ ఎంపీపీగా కె సునీల్ ఎన్నిక: 14 మంది టీడీపీ ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం.. ఇద్దరు వైసీపీ సభ్యుల గైర్హాజరు! 63 రోజుల్లో అమ్మవారి హుండీ ఆదాయం రూ.29.29 లక్షలు ఎమ్మెల్యే సహకారంతో మండల ప్రజా సమస్యల పరిష్కరిస్తా ఎంపీపీ మంజుల రాఘవేంద్ర చంద్రగిరి ఎంపీపీగా సరితా రమణమూర్తి, వైస్ ఎంపీపీగా కె సునీల్ ఎన్నిక: 14 మంది టీడీపీ ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం.. ఇద్దరు వైసీపీ సభ్యుల గైర్హాజరు! చంద్రగిరి ఎంపీపీగా సరితా రమణమూర్తి, వైస్ ఎంపీపీగా కె సునీల్ ఎన్నిక: 14 మంది టీడీపీ ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం.. ఇద్దరు వైసీపీ సభ్యుల గైర్హాజరు! బచ్చే హల్లి గ్రామపంచాయతీ ఎంపీటీసీ గా గొల్ల జ్యోతి ప్రమాణ స్వీకారం కొత్త ఫార్మ్ బిల్లును తక్షణమే ఆమోదించాలి..కాంగ్రెస్‌కు డొనాల్డ్ ట్రంప్ పిలుపు రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజబాబు నేడు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో లక్ష బిల్వార్చన మహోత్సవం

కావలి.. 12వ వార్డులో మునగా మురళి విస్తృత ప్రచారం.

Select Suryaa Now
కావలి.. 12వ వార్డులో మునగా మురళి విస్తృత ప్రచారం.

​కావలి, మేజర్ న్యూస్ :   కావలి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మునగా మురళి ఆధ్వర్యంలో వార్డులో ఇంటింటికీ తిరుగుతూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి వార్డు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి మునగా మురళికి హారతులు పడుతూ, బ్రహ్మరథం పట్టడం ప్రచారంలో ప్రత్యేక విశేషంగా నిలిచింది.  ​ప్రచారంలో భాగంగా వార్డులోని ప్రతి గడపకూ వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి మునగా మురళి మాట్లాడుతూ, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. కావలి పట్టణాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ఎమ్మెల్యే నిరంతరం ప్రత్యేక కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన బాటలోనే నడుస్తూ, 12వ వార్డులో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి, వార్డును అన్ని విధాలా ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.  ​తాను ఎల్లప్పుడూ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మునగా మురళి ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో 12వ వార్డు నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మురళికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.