ఎల్‌నినో ఎఫెక్ట్: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయండి
జలదంకి, మేజర్ న్యూస్ : ప్రస్తుత ఎల్‌నినో ప్రభావం కారణంగా సాగునీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులు వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారిని శ్రీవాణి అవగాహనా తెలిపారు. జలదంకి మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది, ఏఓ మరియు వీఏఏలు రైతులకు అవగాహన కల్పించారు.
బోర్లు మరియు చెరువుల కింద నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరి నార్లు పోయవద్దని రైతులకు సూచించారు. వరికి బదులుగా జొన్న, సజ్జ, రాగి, మొక్కజొన్న వంటి తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని కోరారు.అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా ప్రీమియం వివరాలను రైతులకు తెలియజేశారు. వరి పంటకు ఎకరాకు రూ.168, మినుము పంటకు రూ.38, పెసర పంటకు రూ.36, శనగ పంటకు రూ.56 చొప్పున బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
ప్రతి రైతుకు రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్ ఐడి ) తప్పనిసరని, ఫార్మర్ ఐడి లేనిదే ప్రభుత్వ రాయితీలు మరియు ఎరువులు పొందడం సాధ్యం కాదని వివరించారు. ప్రభుత్వం ఎరువుల పంపిణీని FFS యాప్ ద్వారా డిజిటల్ విధానంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి రైతు తమ భూమి వివరాలను రైతు సేవా కేంద్రం (RSK) వద్ద హెల్ప్ డెస్క్ సహాయకుల ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖాధికారి ఎం. శ్రీవాణి మాట్లాడుతూ రైతులు నీటి లభ్యతను బట్టి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని, ప్రభుత్వ పథకాలు మరియు పంటల బీమా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఎ ఓ,వి ఎ ఎ లు పాలుగోన్నారు.